కలల భారతం : కుల రహిత సమాజం నిర్మితమవుతుందా?

murali krishna
మన దేశానికీ స్వతంత్ర వచ్చి నేటితో ఈరోజుకి సుమారు 75 సంవత్సరాలు పూర్తి  అయింది. అయిన  మన దేశం కులం రహిత సమాజం కోసం ఎంత కృషి చేసిన అంతగా ఫలించలేదు.స్వాతంత్రం రాగానే భారతదేశం, పాకిస్తాన్ అని రెండుగా విడిపోయాయి. భారతదేశంలో బ్రిటిష్ వారు రాకముందు హిందూ మతస్తులు, ముస్లిం మతస్తులు అని రెండు వర్గాలుగా ఉండేది. బ్రిటిష్ వారు వచ్చిన తరువాత క్రైస్తవ మతాన్ని ప్రెవేశపెట్టారు. ఈ  మత ప్రచారాన్ని ఎక్కువ చేసారు. చాలా మంది హిందువులని క్రైస్తావ మతంలోకి మార్చడం జరిగింది.కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత ఏ మతాన్ని కించపరచకుండా దేశంలో ప్రతి మతాన్ని గౌరవించాలి అని చెప్పడం జరిగింది. ఏ మతానికి సహకరించకుండా అన్ని మతాలను కూడా ఒకేవిధంగా చూడాలని చెప్పింది. అదేవిధంగా దేశంలో అనేక కులాలు వున్నాయి. అందులో పేదవారు వున్నారు మరియు డబ్బున్న ధనవంతులు వున్నారు. ధనవంతుల చేతులో పేద కులాలు వారు ఎప్పుడు అణచివేతకు గురి అయ్యేవారు.

పేద కులాల వారు ఎటువంటి  అణచివేతకు గురికాకుండా అన్ని పేద బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ లు కల్పించాలని అప్పటి రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటి అధ్యక్షుడు అయిన డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. దాని ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగింది.స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలు అయిన కొన్ని ప్రాంతాలలో పేదవారు అయిన దళితులు ఇంకనూ అణిచివేతకు గురి అవుతున్నారు.దేశంలో స్వతంత్రం రాకముందు అగ్రవర్ణ కులాలకు మాత్రమే చట్ట సభలలో పాల్గొనే అధికారం ఉండేది. కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రకటించిన రిజర్వేషన్ ల ఆధారంగా వారికి చట్ట సభలలో వారికీ సీట్లు కేటాయించడం జరిగింది. ఎన్నో ఏళ్లగా అణచివేతకు గురి అవుతున్న మహిళలకు కూడా 33శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ దేశంలో మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప అని చాలా గొడవలు జరుగుతున్నాయి. మనిషికి మనిషికి దూరం పెరిగిపోతుంది. దేశం అభివృద్ధి చెందాలంటే కుల రహిత సామ్రాజ్యం రావాలి. రాబోయే రోజులలో ఈ కుల రహిత సామ్రాజ్యం రావాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: