ఖైదీలో చిరు పక్కన ఛాన్స్ మిస్ చేసుకుని బాధపడ్డ హీరోయిన్ ?
అలా ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు విజయ గార్డెన్ లో జరిగాయి. ఇక చిరంజీవి తీయబోయే సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈమె చేస్తున్నటువంటి డాన్స్ ను చూసి , చిరంజీవి ఖైదీ మూవీ లో జయలలితకు నటించడానికి అవకాశం ఇస్తామని తెలిపారు. దాంతో తండ్రి ఎంతో సంతోషించారు. అలా వెంటనే వారు హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లిపోయారు. అలా వెళ్లి వారు మద్రాసులో ఒక ఏరియాలో చిన్నగదిలో అద్దెకు ఉన్నారు.
ఇందులో మొదటి హీరోయిన్ గా మాధవిని ఎంపిక చేశారు. ఇక రెండో హీరోయిన్ గా జయలలితకు అవకాశం ఇస్తామని చెప్పి, నిర్మాతలు మాత్రం సుమలత ను తీసుకోవడం జరిగింది. దీంతో ఆమె తండ్రి ఇంతటి అవకాశాన్ని చేజారిపోయిందని చాలా బాధ పడ్డారట. ఒకవేళ చిరంజీవి సరసన ఖైదీ సినిమాలో జయలలిత హీరోయిన్ గా చేసి ఉంటే.. ఆమె ఎంతో పెద్ద స్టార్ హీరోయిన్ గా నిలిచి ఉండేది. కానీ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది.