ఆ గ్లాడియేట‌ర్ మ‌న‌సు దోచేసిన బాలీవుడ్ క్వీన్..?

Suma Kallamadi
‘ఆస్కార్’ అవార్డు గెలుచుకున్న ‘గ్లాడియేటర్’ ఫిల్మ్‌లో నటించిన నటుడు రసెల్ క్రోకు అశేషమైన అభిమానులున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హాలీవుడ్‌లోనే బిజీయెస్ట్ స్టార్‌గా పేరు సంపాదించుకున్న రసెల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈయన ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో సినిమా చేయబోతున్నారట. అవునండీ.. మీరు చదివింది నిజమే.. అయితే, సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. కానీ, బాలీవుడ్ హీరోయిన్‌తో నటించేందుకుగాను రసెల్ ఒప్పుకన్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పుడూ వివాదాలాకు కేరాఫ్‌గా ఉంటుంది ఈ భామ. ఇటీవల కంగనతో నటించాలని కోరుతూ హాలీవుడ్ యాక్టర్ రసెల్‌ను ఒకరు సోషల్ మీడియా వేదికగా కోరాడు. కాగా ఆ ట్వీట్ చూసి రసెల్ ఓకే నటిస్తాననని చెప్పడం ఇప్పుడు సెన్సేషన్ అయింది. అంటే ‘గ్లాడియేటర్’ రసెల్  మనసును ఆల్రెడీ కంగన ఎప్పుడో దోచేసుకుందని ఆమె ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కంగనకు జతగా రసెల్ నటిస్తే ఇక అవార్డుల వర్షం గ్యారంటీ అని పేర్కొంటున్నారు. అయితే, ఇది ఎంత వరకు నిజమవుతుందనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇకపోతే ఇటీవల యాక్షన్ ఫిల్మ్ ‘ధాకడ్’ షూటింగ్ పూర్తి చేసింది కంగన.


ఇక ఆమె నటిచిన ‘తలైవి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా వస్తున్న ‘తలైవి’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఏ.ఎల్.విజయ్ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండగా, పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రంలో ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వతా కంగనా రనౌత్ పాలిటిక్స్‌లోకి వెళ్తుందనే వార్తలు రాగా కంగన వాటిని కొట్టిపారేసింది. ఇక ‘ధాకడ్’సినిమాలో యాక్షన్ ప్రేక్షకులను అలరించనుందట. ఈ చిత్రంలో ‘ఏజెంట్ అగ్ని’గా కంగన్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్‌గా ఉండబోతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: