మహేష్ బాబు ను ఆకర్షించిన చక్రసిద్ధ !

Seetha Sailaja

కరోనా పరిస్థితుల తరువాత చాలమంది ఆలోచనలలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా యోగా ఆయుర్వేదం లాంటి సనాతన వైద్య విధానాల పై ప్రజలకు ముఖ్యంగా ఎగువ మధ్య తరగతి ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులకు ఆశక్తి బాగా పెరిగింది. దీనికితోడు అలోపతి వైద్యం వలన పరిష్కారం పొందలేకపోతున్న దీర్ఘకాలిక నొప్పుల సమస్యలకు పరిష్కారంగా అనేక ‘పెయిన్ రిలీఫ్ సెంటర్లు’ ప్రజలకు అందుబాటులోకి రావడమే కాకుండా భారీ స్థాయిలో బిజినెస్ కూడ చేసుకుంటున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు తీవ్ర సమస్యగా మారిన ‘మైగ్రైన్’ పెయిన్ కు వైద్యం చేసి అతడి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపించిన ‘చక్ర సిద్ధ’ సనాతన వైద్యం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళనాడులో అత్యంత పురాతనైన చక్రసిద్ధ వైద్యానికి సంబంధించిన ఒక పెయిన్ రిలీఫ్ సెంటర్ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు.


చక్రసిద్ధ యోగులకు సంబంధించిన 36వ తరానికి చెందిన ఒక సిద్ధ విద్యాలయం భాగ్యనగరానికి కొంచెం దూరంలో ఉన్న శంకరపల్లోలో ప్రారంభం కాబడింది. డాక్టర్ సింధూజ నేతృత్వంలో నిర్వహింపబడుతున్న ఈ సెంటర్ కు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.


గతంలో మహేష్ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వారికి వైద్యం చేసిన రెయిన్ బో హాస్పటల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి ఆ హాస్పటల్ గురించి అందరికీ తెలిసి వచ్చేలా చేసాడు. ఆ హాస్పటల్ లో అనేకమంది పేద పిల్లలకు  తన డబ్బుతో గుండె ఆపరేషన్ చేయించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు మహేష్ ను గత కొంత కాలంగా నిరంతరం వేదించిన మైగ్రైన్ పెయిన్ కు చక్ర సిద్ధ వైద్యంలో పరిష్కారం లభించడంతో తనకు జరిగిన మేలు అందరికీ తెలియాలని ఈవిధంగా సనాతనమైన దేశీయ వైద్యాన్ని ప్రయోట్ చేయడం అతడి మంచితనానికి నిదర్శనం అంటూ అనేకమంది అతడి పై ప్రశంసలు కురిపిస్తూ సనాతన వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: