రాజమౌళి దోస్తీ వాళ్లకు నచ్చలేదా?
కాబట్టి సినిమా పండితులు అంచనా ప్రకారం 'ఆర్ఆర్ఆర్' మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాని రాజమౌళి టీం మాత్రం సినిమా ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉన్నారట. అవకాశం దొరికినప్పుడల్లా ప్రమోషన్ చేసుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో 'ఆర్ఆర్ఆర్' బృందం కొన్నాళ్ళు పాటు ప్రొమోషన్స్ సాగిస్తారట.
ఇదిలా ఉండగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'ఆర్ ఆర్ ఆర్ 'పై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాను మించి 'ఆర్ఆర్ఆర్' సినిమాపై అంచనాలు ఉన్నట్లు సమాచారం.
ఈ నెల 1వ తేదీన ఫ్రెండ్ షిప్ డే సందర్బంగా 'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి దోస్తీ అనే పాట విడుదలై అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.అయితే తమిళ్ ఇండస్ట్రీ లో మాత్రం ఈ పాటకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదట.తెలుగులో ఈ పాటకు సుమారు కోటిన్నర వ్యూస్ వస్తే తమిళంలో మాత్రం కేవలం 49 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయట. ఇతర భాషలతో పోలిస్తే తమిళంలోనే ఇంత తక్కువ వ్యూస్ రావడంతో తమిళులు 'ఆర్ఆర్ఆర్' మూవీపై అస్సలు ఆసక్తి చూపట్లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రఖని తప్ప మిగతా తమిళ నటులు ఎవరూ కూడా నటించడం లేదు. ఈ కారణం వల్లనే తమిళంలో 'ఆర్ఆర్ఆర్' మూవీపై భారీగా అంచనాలు ఏర్పడటం లేదా అనే ప్రశ్నలు వస్తూన్నాయట. అయితే చాలా పెద్ద మార్కెట్ అయిన తమిళంలో 'ఆర్ఆర్ఆర్'పై అంచనాలు బాగా పెరిగేలా రాజమౌళి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి మరి.