ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై బాలీవుడ్ లవర్స్..?
ఈ క్రమంలోనే పలు చానల్స్‌కు స్పెషల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ ఫోటోకి జంటగా ఫోజిచ్చారు. ఆగస్టు మంత్ ఎడిషన్ కోసం ఈ ఫొటో షూట్ చేశారు. కాగా, ఈ ఫొటోను చూసి నెటిజన్లు హ్యాపీగా ఫీలవుతున్నారు. మొత్తానికి లవర్స్ జంటగా ఫోజిచ్చారు అని కామెంట్స్ చేస్తున్నారు. పింక్ అండ్ వైట్ డిజైనర్ వేర్లో కియారా ఉండగా, సిద్దార్థ్ డిఫరెంట్ డ్రెస్‌లో అల్ట్రా మోడ్రన్ లుక్‌లో కనిపించారు. ఈ ఫొటోలను చూసి నెటిజనాలు వీరి మధ్య కెమిస్ట్రీ ఎక్సలెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా ఈ కవర్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. వీరు నటించిన ‘షేర్షా’ మూవీ ఈ నెల 12న ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయింది.
బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా.. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తోనూ జతకట్టింది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది ఈ భామ. ఇకపోతే మళ్లీ రామ్ చరణ్‌తో జత కట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకుగాను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఫేమస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్‌లో రామ్ చరణ్ సరసన నటించాలని కోరుతూ మూవీ యూనిట్ ఆల్రెడీ కియారా అద్వానీని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు.