జీవితంలో మరువలేని అనుభూతి.. కాజల్ ఎమోషనల్ కామెంట్స్..!

frame జీవితంలో మరువలేని అనుభూతి.. కాజల్ ఎమోషనల్ కామెంట్స్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కాజల్, కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీకళ్యాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా  థియేటర్ల వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయిన   కాజల్ అందచందాలకు, నటనకు సినీజనం నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన  'చందమామ'  సినిమాతో ఈ ముద్దుగుమ్మ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'మగధీర' సినిమాలో హీరోయిన్ గా  నటించిన కాజల్ ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ చిత్రం తెచ్చిపెట్టిన క్రేజ్ తో తెలుగులో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


ఇలా సినిమా కెరీర్ బాగానే నడుస్తున్న సమయంలోనే కాజల్ ఈ మధ్యనే గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్న ఈ ముద్దుగుమ్మ అందులో భాగంగా 'ఉమ' అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి అయ్యింది. పెళ్లి నేపథ్యంలో ఆసక్తికర పాయింట్ ను తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా కాజల్ కొన్ని విషయాలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. ఇలాంటి సినిమాలో నటించడం ఓ అందమైన అనుభవం. షూటింగ్ పూర్తి అయ్యాక కూడా కొన్ని పాత్రలు మమ్మల్ని వెంటాడుతాయి అలాంటి పాత్రలో ఇది ఒకటి. ఉమ పాత్ర మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో నటించిన కిక్కు ఎప్పుడు మర్చిపోలేను అని కూడా తెలియజేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రమోషనల్ వీడియోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం కాజల్ చిరంజీవి హీరో గా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: