తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల చిత్రాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి కస్తూరి. ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తున్న ఈ నటి. 'స్టార్ మా' లో ప్రసారం అవుతున్న 'ఇంటింటి గృహలక్ష్మి' అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యింది. కస్తూరి సినిమాలు, టీవీ షోల ద్వారా ఎంత బిజీ గా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఈ బుల్లితెర నటి ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్న 'సిక్స్త్ సెన్స్' అనే పోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చింది. ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల గురించి ప్రేక్షకులకు తెలియజేసింది.
కస్తూరి ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి వివరిస్తూ నేను జీవితంలో మూడు సార్లు చావును చూశాను. మొదటిసారి, రెండవసారి మా తల్లిదండ్రులు, మూడవసారి తన కూతురి రూపంలో చావుని అతి దగ్గరగా చూడవలసి వచ్చిందని తెలిపింది. కస్తూరి తన కూతురు లుకేమియా అనే వ్యాధితో బాధ పడింది అని అని, ఆ వ్యాధి నుంచి కోలుకోవడం కోసం మూడు సంవత్సరాల పట్టింది. ఆ సమయంలో నాకు కొడుకు పుట్టాడు కానీ అతనిని నేను మూడు సంవత్సరాలపాటు చూడలేదు. ఆ మూడేళ్లు నేను పడిన టెన్షన్ ఎవరికీ చెప్పలేను. ఆ విధంగా నేను ఆ మూడు సంవత్సరాలు చావును దగ్గర నుండి చూశాను. అలా కూతురు అనారోగ్యంతో ఉన్న మూడు సంవత్సరాలు చాలా విషయాలు నేర్చుకున్నాను అని కస్తూరి తెలిపింది . తానుకు కారు, బంగ్లాలు లాంటివి అవసరం లేదు అని ప్రస్తుతం తన కూతురు లాగానే లుకేమియా తో ఎవరైనా బాధపడితే వారికి తాను పెట్టిన ట్రస్ట్ ద్వారా కావాల్సిన సహాయం చేస్తాను అంటూ తెలిపింది .ఇలా కస్తూరి బాధ తో చెప్పిన మాటలు వైరల్ గా మారుతున్నాయి.