కొత్త కమేడియన్స్ ని ఒక ఆట ఆడుకున్న పంచ్ ప్రసాద్.?

praveen
మొన్నటివరకు ఈటీవీలో కామెడీకి కేరాఫ్ అడ్రస్గా జబర్దస్త్ కార్యక్రమం అనేది ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం తెలుగు ప్రేక్షకులందరినీ మరింత నవ్వించేందుకు ఎన్నో కొత్త కామెడీ ప్రోగ్రామ్స్ తెరమీదికి వస్తున్నాయి. ఇక అన్ని కార్యక్రమాలు కూడా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ మంచి రేటింగ్ సొంతం చేసుకున్నాయి.  ఇలా ప్రస్తుతం ఈ టీవీ లో ప్రేక్షకుల అందరినీ ఆకర్షిస్తూ ప్రతివారం వినూత్నమైన కామెడీ పంచుతున్న కార్యక్రమాల్లో రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమం కూడా ఒకటి. కొత్తగా స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులకు కొత్త కామెడీ ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. ఇక ఈ షో లో స్పెషల్ గెస్ట్ గా రాజీవ్ కనకాల ఉంటున్నారు.


 అయితే రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమంలో కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు కొత్త కమెడియన్స్ కి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు ఈటీవీ నిర్వాహకులు.  ఇక ప్రస్తుతం వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించి రెచ్చిపోదాం బ్రదర్  కార్యక్రమం ప్రోమో విడుదల అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక రెచ్చిపోదాం బ్రదర్ లో అటు జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కూడా తన కామెడీతో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ప్రోమోలో ఎంతో మంది కొత్త కమెడియన్స్ ని తన ఆటో పంచులతో ఒక ఆట ఆడుకున్నాడు పంచ్ ప్రసాద్.

 కొంతమంది యువ కమెడియన్స్ స్కిట్ చేస్తున్న సమయంలో ఒక కమీడియన్ వచ్చి ఇగో అన్నా అని పిలుస్తాడు..  అరే నాకు ఇగో లేదురా నేను మంచోడినే అంటూ ఆటో పంచ్ వేస్తాడు పంచ్ ప్రసాద్.. నీకు ఇగో కాదన్నా ఇగో మా పోరడు అని కొత్త కమెడియన్ చెప్పగా..  అరే ఇగో కమెడియన్ అయితే వద్దు రా మనకి మంచి పోరడు కావాలి అంటూ మరో పంచ్ వేస్తాడు. అన్నా వాడు వడ్డించేవాడు అన్నా అని చెప్తే.. అవునా వడ్డీకి ఇస్తావా ఓ లక్ష రూపాయలు ఇవ్వు అంటూ మరో ఆటో పంచ్  వేస్తాడు. ఇలా వరుస పంచులతో యువ కమెడియన్స్ ని ఒక్క ఆట ఆడుకున్నాడు.  దీంతో అక్కడున్న వారందరూ పగలబడి నవ్వుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv

సంబంధిత వార్తలు: