'మా'
ఎలక్షన్స్ అభ్యర్థుల మధ్య రగడ ప్రతిసారి కంటే ఈసారి కాస్త ఆసక్తికరంగానే జరుగుతుంది. మొదట ప్రముఖ నటుడు
ప్రకాష్ రాజ్ 'మా' ఎన్నికలకు దాదాపు రెండు నెలల వ్యవధి ఉండగానే నేను 'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అని ప్రకటించుకున్నాడు. దానితో ఎన్నికల హవా ఇక మొదలైంది అని సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఇంతలోనే కలెక్షన్
కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా ఎలక్షన్ బరిలో దిగుతున్నాను అంటూ ప్రకటించుకున్నాడు. దీనితో వీరిద్దరి మధ్య గట్టి పోటీనే నడుస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వీరిద్దరి మధ్య వాడి వేడి వాతావరణం కొనసాగుతున్న సమయంలోనే
జీవిత రాజశేఖర్ కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటించుకున్నారు. వీరితో పాటు నటి
హేమ , కె ఎల్ నరసింహారావు పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. పోటీదారులు తమ మద్దతుదారులతో
టీవీ షోలకు ఇంటర్వ్యూ ఇస్తూ, అనేక కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. ఇలా సాగిపోతున్న 'మా'
ఎలక్షన్స్ వ్యవహారంలో తాజాగా నటి
హేమ నుండి సర్క్యులేట్ అయిన
ఆడియో దుమారాన్ని రేపుతోంది.
నటుడు
నరేష్ అధ్యక్షుడు అయినప్పటి నుండి ఖర్చు పెట్టడం తప్ప రూపాయి తేలేదు అంటూ
హేమ సర్క్యులేట్ చేసిన
ఆడియో మెసేజ్ ప్రస్తుతం
ఇండస్ట్రీ లో దుమారం రేపుతోంది.
హేమ మాటలను 'మా' అధ్యక్షుడు
నరేష్, జనరల్ సెక్రటరీ
జీవిత రాజశేఖర్ ఖండించారు. ఇదిలా ఉంటే ఇష్యూపై
మెగాస్టార్ చిరంజీవి కూడా సీరియస్ కావడం ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతుంది. ఎన్నికల పేరుతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మా' ప్రతిష్టను దెబ్బ తీస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు కు
లేఖ రాశారు. సభ్యుల బహిరంగ ప్రకటనతో 'మా'
ప్రతిష్ట మసకబారుతోంది అని వెంటనే ఎన్నికలు జరపాలి అంటూ
చిరంజీవి లేఖలో తెలిపారు. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని అన్నారు. 'మా' ఎన్నికలకు సంబంధించి
చిరంజీవి లేక ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.