కాక రేపుతున్న "మా" ఎన్నికల లేఖలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కృష్ణంరాజు...?

Suma Kallamadi
మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎలక్షన్లలో ఎన్నడూ లేని విధంగా పోటీదారులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తున్నారు. ఇవి సినిమా ఎన్నికలే అయినప్పటికీ పొలిటికల్ ఎలక్షన్లను తలపిస్తున్నాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి పరిస్థితులను శాంత పరిచేందుకు సిద్ధమయ్యారు. త్వరగా మా ఎలక్షన్లు నిర్వహిస్తే పోటీదారుల ఆరోపణలకు తావుండదని ఆయన భావిస్తున్నారు. మా ప్రతిష్టకు భంగం వాటిల్లకూడదని ఆయన మా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు ఒక లెటర్ రాస్తూ ఎన్నికలు నిర్వహించడం అనివార్యం అని చెప్పుకొచ్చారు. అయితే సెప్టెంబర్ 12 వ తేదీన మా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ఇటీవల సమాచారం అందింది. కానీ ఇప్పటి వరకూ అధికారిక ఎన్నికల నిర్వహణ తేదీ ప్రకటించలేదు. మరో పది రోజుల్లో ఎన్నికల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ఈసారి మా ఎన్నికల్లో పోటీ చేసే మంచు విష్ణు,  జీవితా, హేమ, ప్రకాశ్‌రాజ్‌ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కమెడియన్, సహనటి హేమ హద్దులు దాటి మరీ ఆరోపణలు చేస్తూ అందరికీ రక్తం సలసల మరిగేలా చేస్తోంది. దీంతో ఆమెకు మా క్రమశిక్షణా సంఘం నుంచి షోకాజ్‌ నోటీసులు అందాయి. అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేసిన హేమ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోవాల్సి ఉందిగా క్రమశిక్షణా సంఘం ఆదేశించడం తో ఆమె సైలెంట్ అయిపోయింది.

నాన్-లోకల్ అయిన ప్రకాశ్‌రాజ్‌ మా అధ్యక్ష ఎన్నిక బరిలో దిగుతున్నారని ప్రకటించిన సమయం నుంచి అనేక ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఇక జీవితా రాజశేఖర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ సారి మా ఎన్నికలు చాలా ఉత్కంఠ భరితంగా మారాయి. అనూహ్యంగా మంచు విష్ణు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో భారీ పోటీ నెలకొంది.

ఇకపోతే తెలుగు కళాకారుల సంక్షేమం కోసం పని చేసే మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ఆరేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయం నుంచి మా ఎలక్షన్లకు మంచి గుర్తింపు దక్కింది. టాలీవుడ్ అగ్ర నటీనటుల అందరూ కలిసి మా అసోసియేషన్ కి బీజం వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: