అక్కినేని కుటుంబం నుంచి ఏ సినిమాలు వచ్చినా కూడా ప్రజలు ఆదరిస్తారు. మనం సినిమా ద్వారా అక్కినేని ఫ్యామిలీ మొత్తం మెరిసింది. అందులో అఖిల్ కూడా కనిపించాడు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఏజెంట్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. సినిమాలో అఖిల్ లుక్ అదిరిపోయింది. కండలు పెంచి అద్బుతమైన బాడీతో అక్కినేని అఖిల్ కనిపించాడు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ కొత్త లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ స్పాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అక్కినేని అఖిల్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను సంతోషపెడుతున్నాడు. ఇప్పటి వరకూ అక్కినేని అఖిల్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా లేదు. ఈసారి కచ్చితంగా విజయం వస్తుందని అక్కినేని అఖిల్ బాగా కష్టపడుతున్నాడు. కొత్త లుక్ ను చూసి అమ్మాయిలు ఫిదా అయిపోయారు.
ప్రస్తుతం అక్కినేని అఖిల్ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో, ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. వాటిని చూసి ఫ్యాన్స్ ఫిదా అవ్వడమే కాదు అమ్మాయిలు వావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. గుర్రపు స్వారీలు తన కెంతో ఇష్టమని ఇది వరకూ అక్కినేని అఖిల్ ఫ్యాన్స్ కు చెప్పాడు. ఇప్పుడు తమ హీరో ఇలా గుర్రంపై వెళ్తున్న ఫోటోలను చూసి సంతోషపడుతున్నారు. వీడియోలో అఖిల్ స్లో మోషన్ లో గుర్రంపై రావడం చూడొచ్చు. దీనిపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అఖిల్ గుర్రంపై వస్తుంటే రియల్ హీరోలా ఉన్నాడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ మరో సినిమా కూడా చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీని చేస్తున్నాడు. ఆ సినిమా విడదులవ్వడానికి సిద్దంగా ఉండగా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది.