ఆ పాత్ర కోసం మహానటి అన్ని కోట్లు డిమాండ్ చేసిందా..?

Suma Kallamadi
సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రంలో కీర్తిసురేష్ అద్భుతమైన నటనా ప్రదర్శన కనబర్చి జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. ఈ ఒక్క సినిమాతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలూ ఆమె వద్దకు తన్నుకొచ్చాయి. ఆమె చేసిన మహిళా ప్రాధాన్యత చిత్రాలైన పెంగ్విన్, మిస్ ఇండియా డిజాస్టర్స్ అయ్యాయి. గుడ్ లక్ సఖి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ మహేష్ సరసన 'సర్కారు వారి పాట'లో నటించే సదవకాశాన్ని దక్కించుకున్నారు.

ఇదిలా ఉండగా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వేదాళం' రీమేక్ లో కీర్తి ఓ కీలక పాత్ర పోషించేందుకు ఓకే చెప్పారు. చిరంజీవి సోదరిమణిగా కీర్తి నటించనున్నారు. అయితే సిస్టర్ పాత్ర చేసినందుకు గాను రూ.3 కోట్లు పారితోషికం ఇవ్వాలని కీర్తి తేల్చి చెప్పారట. ప్రస్తుతం ఈ వార్త సినీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా కీర్తి ప్రతి సినిమాకి రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. 'సర్కారు వారి పాట' మూవీ కోసం కూడా రూ.2 కోట్లు పారితోషికంగా అందుకుంటున్నారని సమాచారం.

అయితే మెగాస్టార్ చెల్లెలి పాత్ర కోసం ఆమె తన ప్రస్తుత పారితోషికం కంటే కోటి రూపాయలు ఎక్కువగా అడుగుతున్నారు. నిజానికి ఎక్కువ నిడివి గల చిరు సిస్టర్ పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. అందులోనూ దిగ్గజ నటుడు చిరంజీవికి చెల్లెలిగా నటించడం చాలా కష్టం. అతనికి ధీటుగా నటించే నటిని నటింపజేస్తేనే అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో సాగే ఈ సినిమా రక్తి కడుతుంది. మూవీకి ఆయువుపట్టు చిరంజీవి చెల్లి పాత్రే!

అయితే ఈ విషయాలన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే కీర్తి రూ.3 కోట్లు డిమాండ్ చేశారని తెలుస్తోంది. కానీ అంత మొత్తంలో డబ్బు చెల్లించడానికి మొదటి నిర్మాతలు వెనకడుగు వేశారు. ఆమెకు బదులుగా వేరే హీరోయిన్ ని తీసుకోవాలని భావించారు కానీ మంచి టాలెంట్ గల నటీమణులు ఎవరూ కూడా కనిపించలేదు. దీంతో చివరికి మూవీ యూనిట్ కీర్తి సురేష్ అడిగినంత మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: