డార్లింగ్ ప్రభాస్ కెరియర్ 'మిర్చి' సినిమాకు ముందు ఓ లెక్క ఆ తర్వాత ఓ లెక్క అని చెప్పవచ్చు. 'మిర్చి' సినిమా వరకు కేవలం టాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ మార్కెట్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్ లోనే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే 'బాహుబలి' తర్వాత 'సాహో' అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు. ఈ సినిమా టాలీవుడ్ జనాల కంటే బాలీవుడ్ జనాలనే ఎక్కువగా ఆకట్టుకుంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ రాదే శ్యామ్, ఆది పురుష్, సలార్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఒక సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలలో ఇన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ఏకైక హీరో డార్లింగ్ ప్రభాస్ అని చెప్పవచ్చు. ఇప్పటికే 'రాధే శ్యామ్' సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. అని మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఇక ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆది పురుష్' సినిమా కూడా ఇప్పటికే 50 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'కే జి ఎఫ్' సినిమా తో ఇండియా వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే సినిమాలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వీటితోపాటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ మధ్యనే పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ప్రభాస్ చేయబోయే ఈ సినిమాల లిస్టును చూస్తే ప్రభాస్ జోరు మామూలుగా లేదుగా.. ఈ హీరో ని ఆపడం అంత ఈజీ కాదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.