'రాజమౌళి-ఎన్టీఆర్' స్నేహం ఎలాంటిదో తెలుసా ?

VAMSI
చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అతను తెరకెక్కించారు అంటే ఇక అది బ్లాక్ బాస్టర్. తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ డైరెక్టర్ తో సినిమా అంటేనే సక్సెస్ కు సైన్ చేసినట్లే. ఇవన్నీ విన్నాక ఇకా ఆయన పేరు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆయనే టాలీవుడ్ జక్కన్న. మన అభిమాన దర్శకుడు రాజమౌళి. ఇక మరో వైపు నందమూరి వారసత్వం, అంతకు మించిన ప్రతిభ, నాటి భరతనాట్యం అయినా నేటి బ్రేక్ డాన్స్ అయినా దుమ్మురేపగల సత్తా ఆయన సొంతం. కృషికి పట్టుదలకు మారుపేరు అతనే జూనియర్ ఎన్టీఆర్. ప్రతిష్టాత్మక దర్శకుడు రాజమౌళి మరియు జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య మంచి స్నేహం అనేకంటే అంతకంటే ఎక్కువ అనుబంధం ఉందని చెప్పొచ్చు. 'స్టూడెంట్ నంబర్ వన్' చిత్రంతో దర్శకుడిగా మారిన రాజమౌళి నాటి నుండి సక్సెస్ అనే మాటకు కేరాఫ్ అడ్రస్ గా మారారు.
ఆ సినిమా వచ్చి నేటికి 19 ఏళ్ళు పైనే గడుస్తోంది తన మొదటి చిత్రం తనకు ఎంతో అదృష్టాన్ని తెచ్చి పెట్టిందని ఆయన అనుకుంటుంటారట. ఆ సినిమా షూటింగ్ సమయంలో తారక్ తో నా మొదటి ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతం. అంత పెద్ద కుటుంబం నుండి వచ్చినప్పటికీ  తారక్ తనతో చాలా స్నేహంగా ఉండేవారని అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ స్నేహం అలానే కొనసాగింది, ఇకముందు కూడా అలానే కొనసాగుతుంది కూడా అని ఆయన అన్నారు. ఓ మీడియా సమావేశంలో మీకు ప్రభాస్ అంటే ఎక్కువ ఇష్టమా లేక తారక్ అంటే ఎక్కువ ఇష్టమా అని అడిగితే. అందుకు దర్శకుడు రాజమౌళి నాకు ప్రభాస్ అంటే ఇష్టం కానీ, ఒక ఫ్రెండ్ గా తారక్ చాలా చాలా ఇష్టమని కుండబద్దలు కొట్టారు. ఆ ఒక మాటతో వీరి మద్య స్నేహం ఎలాంటిదో ఊహించుకోవచ్చు.

 
అంతేకాదు డైరెక్టర్ రాజమౌళి మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్  కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయి అని... ఇరు కుటుంబాల్లో ఎలాంటి ఫంక్షన్ లో అయినా మరొకరు కుటుంబం పాల్గొంటుందని అంత సాన్నిహిత్యం మీరు కుటుంబాల మధ్య ఉందని ఇండస్ట్రీలో టాక్. దర్శకుడు రాజమౌళి చేసింది తక్కువ సినిమాలే అందులో ప్రతి సినిమా ఒక సంచలనమే. వాటిలో 3 సినిమాలు స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ తారక్ తోనే తెరకెక్కించారు రాజమౌళి. ఇపుడు 'ఆర్ఆర్ఆర్'  చిత్రంతో 4వ సారి ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా కూడా ఖచ్చితంగా రికార్డులు తిరగరాస్తోంది అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: