సీనియర్
హీరోయిన్ సుహాసిని తెలుగులో శోభన్ బాబు ,చిరంజీవి,
బాలకృష్ణ వంటి హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా ఈ నటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఎన్టీఆర్ హీరోగా
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాఖీ'
సినిమా లో
పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో
సుహాసిని చేసిన నటనకు సినీ జనం నుండి మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. కానీ గత కొద్ది కాలంగా సినిమాల పరంగా ఈ సీనియర్ నటి కొంచెం స్లో అయిందని చెప్పవచ్చు. గత ఏడాది
సుహాసిని 'మరక్కర్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు
సుహాసిని సిద్ధం అయింది. 'మళ్ళీ మొదలైంది' సినిమాతో
సుహాసిని తెలుగులో అడుగుపెట్టనుంది.
అయితే ఈ సినిమాలో
సుహాసిని హీరోయిన్ తల్లిగా లేదా
హీరో తల్లిగా నటిస్తుంది అనేది ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్
పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో ఆమె పాత్ర కు సంబంధించి పూర్తి స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆమె విడాకులు తీసుకున్న
భార్య గా, సింగల్ మదర్ గా ,వ్యాపారవేత్తగా, మంచి ఆలస్యాన్ని గుర్తించే వ్యక్తిగా, బలమైన మరియు ధైర్యమైన వ్యక్తిగా సుజా అనే పాత్రలో కనిపించబోతున్నారు అని
పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక
సుమంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి టి.జి.
కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సైనా గంగూలీ హీరోయిన్గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను కే.
రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని సోషల్
మీడియా వేదికగా
సుహాసిని తెలియజేశారు. కొంతకాలం విరామం తర్వాత తెలుగు లో అడుగు పెడుతున్న
సుహాసిని కి 'మళ్ళీ మొదలైంది' సినిమా ఎలాంటి విజయాన్ని తీసుకు వస్తుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.