ఎన్టీఆర్ - కొరటాల శివ మూవీలో మరో సర్ప్రైజ్ ?

VAMSI
టాలీవుడ్ హాసినిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ తెచ్చుకున్న జెనీలియా ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగిన విషయం తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, భాషల్లోనూ నటించి ఫాలోయింగ్ పెంచుకుంది. బాలీవుడ్ లో అడుగు పెట్టి అక్కడ హిందీలోనూ 'తుజే మేరి కసం' వంటి పలు సినిమాల్లో నటించి నటిగా తానేంటో నిరూపించుకుంది. అలా కెరియర్ మంచి స్పీడ్ గా ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలా వివాహం అనంతరం సినిమాలకు దూరమైన హాసిని మళ్లీ ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నరంటూ ఈ మధ్య వార్తలు కోకొల్లలుగా వినిపించాయి.
హీరో రామ్ తో మరోసారి జత కట్టబోతున్నారు అంటూ ప్రచారాలు కూడా జరిగాయి. అయితే ఇప్పటి వరకు తను ఏ  సినిమా చేయబోతున్నది అనే విషయంపై క్లారిటీ రాలేదు. నిన్న మొన్నటి వరకు మళ్లీ జెనీలియా హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని అనుకుంటుండగా ఇప్పుడు మరో వార్త దాన్ని బ్రేక్ చేసింది.  పవర్ ఫుల్ హీరో ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఈ హీరో ఎన్టీఆర్ కి బెస్ట్ ఫ్రెండ్ గా జెనీలియా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కథకు ఈ ఫ్రెండ్ క్యారక్టర్ చాలా కీలకమని తెలుస్తోంది. మొదట్లో ఈ పాత్రకు జెనీలియా నిరాకరించినా సినిమాను మొత్తం ప్రభావితం చేసే ప్రముఖ పాత్ర అని తెలుసుకొని చేస్తానంటూ ఓకే చెప్పారట.

 అయితే ఒకప్పుడు ఎన్టీఆర్ తో  హీరోయిన్ గా చేసిన జెనీలియా ఇప్పుడు ఫ్రెండ్ క్యారక్టర్ చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: