బిగ్ బాస్ 5 : అందరూ కన్ఫార్మ్.. కానీ అతనొక్కడే క్లారిటీ ఇవ్వలేదట?

praveen
ఈ మధ్యకాలంలో బుల్లితెరపై షోస్ హడావిడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఎన్ని షోస్ ఉన్నప్పటికీ..  ఎన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నప్పటికీ ఒకసారి బిగ్బాస్ ప్రారంభం అయ్యింది అంటే చాలు బుల్లితెర ప్రేక్షకుల అందరి చూపు  అటు వైపు వెళ్తుంది. మీ ఇంటి తో పాటు మా ఇంటి పై కూడా ఒక కన్నేసి ఉంచండి అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంటుంది.  ఇక నాగార్జున వ్యాఖ్యాతగా బిగ్ బాస్ 4 ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బిగ్ బాస్ ఐదవ సీజన్ గురించి గత కొన్ని రోజులుగా ఎన్నోరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి

 ఇక మరికొన్ని రోజుల్లో బిగ్బాస్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది  అయితే బిగ్బాస్ ప్రారంభానికి ముందు ఇక హౌస్ లోకి వెల్లే కంటెస్టెంట్స్ ఎవరు అనే దానిపై ఎన్నో ఊహాగానాలు వెలువడుతాయి. కొన్ని కొన్ని సార్లు ఈ ఊహాగానాలు నిజమే అవుతూ ఉంటాయి. ఇటీవలే కొన్ని రోజుల క్రితమే బిగ్ బాస్ 5 కి సంబంధించిన లోగోని స్టార్ మా వదలడంతో మళ్ళీ బిగ్ బాస్ షో పై ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెల్లే కంటెస్టెంట్ ఎవరు అనేదానిపై కొంత సమాచారం వినిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది పేర్లు కన్ఫర్మ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.

 బుల్లితెర వెండితెర నుంచి కొంత మందిని సెలెక్ట్ చేసారట. ఇక సోషల్ మీడియా విభాగం నుంచి కూడా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ పేరు కూడా వినిపించింది గత కొంతకాలం నుండి. కానీ ఇక షణ్ముఖ్ జస్వంత్ ఎంట్రీపై ఇంకా క్లారిటీ రాలేదట బిగ్బాస్ యాజమాన్యానికి. బిగ్ బాస్ లో కి రావాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోడానికి ఇక బిగ్బాస్ నిర్వాహకులను  ఒక వారం టైమ్ అడిగాడట షణ్ముఖ్ జస్వంత్. దీంతో షణ్ముఖ్ జస్వంత్ వస్తాడా లేదా అనే దానిపై మాత్రం ప్రస్తుతం క్లారిటీ లేకుండా పోయిందట. ఇక మరో వారంలో దీనిపై పూర్తి స్థాయి విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్బాస్ షో ప్రారంభం అవుతుందని మరోసారి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించ పోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: