క్యాట్ వాక్ తో సెగలు పుట్టిస్తున్న సమంత.. వీడియో వైరల్..!

Suma Kallamadi
అగ్ర కథానాయిక సమంత అక్కినేని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. నిన్న స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో చాలా ఫొటోలు షేర్ చేశారు. ఆ ఫొటోలలో సమంత తన క్లోజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఉండటం చూడొచ్చు. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో ఒక కోటి 79 లక్షల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె తనకున్న అద్భుతమైన నటనా టాలెంట్ తో ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారని చెప్పుకోవచ్చు. అలాగే ఆమె ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పటికే ఆమె 1,200 పైగా పోస్టులు పెట్టారు. ఆమె తన అభిమానుల కోసం ప్రతి రోజూ ఏదో ఒక ఫొటో గాని, వీడియో గాని షేర్ చేస్తారు.

తాజాగా కూడా ఆమె ఒక అదిరిపోయే వీడియో తన అభిమానులతో పంచుకున్నారు. "నా స్టైల్ చాలా సాధారణంగా ఉంటుంది అని నేను అనుకుంటాను." అని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ వీడియోకి కాప్షన్ జోడించారు. అయితే ఆ వీడియోలో ఆమె తాను అనుకున్న దానికి చాలా భిన్నంగా స్టైలిష్ గా ఉన్నారు. దాదాపు 10 స్టైలిష్ డ్రెస్ లలో ఆమె తలుక్కుమన్నారు. అంతేకాదు చాలా స్టైలిష్‌‌గా క్యాట్ వాక్ చేస్తూ ఆమె తన అభిమానుల హృదయాలను దోచేశారు. కొంటెగా కెమెరా వైపు చూస్తూ ఆమె పలికించిన హావభావాలు సెగలు పుట్టిస్తున్నాయి.

దీంతో వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ వీడియోపై అభిమానులు లవ్లీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజ్ఞా జైస్వాల్, రూహాణి శర్మ వంటి సెలబ్రిటీలు సైతం ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేశారు. ఇక అభిమానులు హార్ట్, ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోకి 10 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఐదువేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. ఇక ఒలంపిక్స్ ఆటల్లో సత్తా చాటుతున్న భారతీయ క్రీడాకారులను ఆమె తెగ ప్రశంసిస్తున్నారు. బ్యాట్మెంటన్ సింగిల్స్‌ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న పీవీ సింధు ని కూడా ఆమె తెగ పొగిడారు. కమల్ ప్రీత్ కౌర్, వందన కథారియా వంటి మహిళా క్రీడాకారులను కూడా ఆమె పొగిడారు.


Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: