నవ్వించే గీత సింగ్.. ఆ విషయం చెప్పి ఏడిపించేసింది?
ముఖ్యంగా ఈ సినిమాలో గీతాసింగ్ పాత్రలో అయితే తెలుగు ప్రేక్షకులందరికీ ఎప్పటికీ గుర్తుండి పోతుంది అని చెప్పాలి. అయితే కితకితలు తర్వాత ఇంకా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన శైలిలో కామెడీని పంచి అలరించింది గీతాసింగ్. అయితే ఎప్పుడు తెర మీద కనిపించి ప్రేక్షకులు అందరినీ నవ్వించే గీతాసింగ్ ఇటీవలే తన బాధలు చెప్పుకుంటూ అందరిని ఏడిపించింది. ఇటీవలే ఈ టీవీలో ప్రసారమయ్యే క్యాష్ అనే కార్యక్రమానికి హాజరైంది గీతాసింగ్. కాగా ఇటీవల క్యాష్ షో కి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇక క్యాష్ షో లో కి గెస్ట్ గా వచ్చిన గీతా సింగ్ మొదటి నుంచి అదిరిపోయే పంచులు వేస్తూ అలరిస్తూ వచ్చింది.
ఈ క్రమంలోనే చివర్లో ఇక తనకు ఎదురైన చేదు అనుభవాలను చెబుతూ ఎమోషనల్ అయ్యింది గీత సింగ్. తెరమీద నేను కనిపిస్తే నవ్వుకున్న వారే బయట కనిపిస్తే మాత్రం ఎన్నో కామెంట్స్ చేస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది ముఖ్యంగా పర్సనల్ విషయాలను అడుగుతూ ఉంటారు అంటూ తెలిపింది. మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటూ అడుగుతారని అలా అడిగినప్పుడు ఎంతో బాధ పడతాను అంటూ చెప్పుకొచ్చింది. వెండి తెరపై కనిపించినంతవరకే మీకు పట్టింపు ఉంటుందని.. కానీ పర్సనల్ విషయాల గురించి మీకు అవసరం లేదు.. నేను పెళ్లి చేసుకోక పోయినప్పటికీ నేను నా తల్లిదండ్రులు సంతోషంగానే ఉన్నారు.. పర్సనల్ విషయాలు మీకు అవసరం లేదు అంటూ తనపై కామెంట్ చేసే వాళ్ళను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది గీతా సింగ్. కాగా ఎప్పుడూ సరదాగా నవ్వుతూ కనిపించే గీతాసింగ్ ఒక్కసారిగా ఎమోషనల్ కావడంతో అభిమానులు అందరూ కంటనీరు పెట్టుకున్నారు.