రామ్ చరణ్ మూవీలో కేరళ స్టార్ హీరో ?

VAMSI
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎక్కడా తగ్గకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు రామ్ చరణ్. కొత్తగా రానున్న రామ్ చరణ్ సినిమాలో మరో ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ మరియు ప్రముఖ దర్శకుడు శంకర్ ల కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాకపోయినా రోజుకొక గాసిప్ తో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఇందులో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోందని ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ వచ్చిన మెగా అభిమానులు ఓ రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో గాసిప్ అటు తమిళ్ మరియు తెలుగు ఇండస్ట్రీలలో హల్ చల్ చేయడానికి సిద్ధంగా ఉంది.

ఈ సినిమాలో ఒక కీలక పాత్రకు మలయాళ టాప్ హీరోను నటింపచేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ సినిమా అంటేనే ప్రేక్షకులకు ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలను అందుకోవడానికి శంకర్ ఎంత దూరమైన వెళ్ళడానికి వెనుకాడడు. అందులో భాగంగానే ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఒక కీలక సన్నివేశానికి బలం చేకూర్చడానికి మలయాళ హీరోను వాడనున్నాడని సమాచారం. అయితే ఆ హీరో ఎవరు అన్న వివరాలు ఇంకా సస్పెన్స్ గానే ఉన్నాయి. వీలైనంత త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య మరియు ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అతి త్వరలోనే ఈ రెండు సినిమాలు షూటింగ్ ను పూర్తి చేసుకోనున్నాయి. ఈ రెండు సినిమాలపై మెగా అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈ అంచనాలను ఈ రెండు సినిమాలు అందుకోగలవా అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: