సాధారణంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు . మిగతా సినీ ఇండస్ట్రీ లో కూడా హీరోయిన్ ఎక్స్పోజింగ్ ఇస్తేనే , ఆమెకు ఎక్కువగా క్రేజ్ ఉంటుందనేది వాస్తవం. అంతేకాదు ఇటీవల చాలామంది ఎక్స్ పోజింగ్ ఇస్తూ, కుర్రకారును తమ వైపు తిప్పుకుంటున్న హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. "పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు" గా కొంతమంది హీరోయిన్లు వాళ్ళను, వీళ్ళను చూసి , ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అవుతూ, మరీ ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేస్తూ, క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం సినిమాలలో అవకాశాలు రాకపోయినా పర్లేదు , వారు నటించే పాత్రలకు ప్రయారిటీ ఉంటే చాలు ..అని అంటున్నారు మరికొంతమంది..
అంతేకాదు వారి దగ్గరకు ఏదైనా కథ వచ్చినప్పుడు, అందులో మీరు ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుందని అనగానే, వారు ఏ మాత్రం ఆలోచించకుండా ఆ పాత్రను వదులుకోవడానికి కూడా సిద్ధం అవుతున్నారు. అలాంటి వారిలో ముందుండేవారు నివేదాథామస్. ఈమె సినీ ఇండస్ట్రీలోకి 2008లో వచ్చిన వేరుతే ఒరు భార్యతో అనే మలయాళం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటించిన తీరుకు ఉత్తమ బాల కళాకారిణిగా కూడా కేరళ రాష్ట్ర చలన చిత్ర పురస్కారాలను కూడా అందుకుంది.
ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తే, 2016లో నాని సరసన జెంటిల్మెన్ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక ఈ సినిమాలో ఈమె నటించిన తీరుకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అంతేకాదు ఈ సినిమాతో ఉత్తమ తొలి మహిళ కథానాయికగా కూడా అవార్డు పొందింది. ఇక ఆరు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తో పాటు ఫిలిం ఫేర్ అవార్డులు కూడా అందుకోవడం గమనార్హం. ఇక 2017 లో వచ్చిన నిన్ను కోరి సినిమాతో ఉత్తమ నటి గా ఫిలింఫేర్ అవార్డుతో పాటు 65వ దక్షిణ ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకుంది. ఇక ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అంతేకాదు ఇటీవల పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించి, తన క్రేజ్ ను మరింత పెంచేసింది నివేదా. ఇక ఈమె బుల్లితెరపై కూడా దాదాపు నాలుగు టీవీ సీరియల్స్ లో నటించింది. మలయాళం, తమిళ చిత్రాలలో కూడా నటించి, అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఈమె తీసిన అన్ని సినిమాలలోనూ ఒక్కసారి కూడా ఎక్స్పోజ్ చేసి నటించలేదు. కేవలం తన అందం, నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసి, మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.