పుష్ప పై సన్నీలియోన్ టార్గెట్ !

Seetha Sailaja
సుకుమార్ సినిమాలు అంటే ఐటమ్ సాంగ్ కు ప్రసిద్ధి. ‘ఆ అంటే అమలాపురం’ ‘రింగ రింగా’ ‘జిగేల్ రాణి’ ఇలా ఈ ఐటమ్ సాంగ్స్ పాటలు అన్నీ ఎవరిగ్రీన్ సూపర్ హిట్. చాలామంచి సినిమాలు తీసే సుకుమార్ ను ఇలాంటి ఐటమ్ సాంగ్స్ ను సినిమాలలో ఎందుకు పెడుతున్నారు అని అడిగినప్పుడు గతంలో ఆయన ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

ఒక వ్యక్తి గొప్పవాడుగా ఎదిగినప్పటికీ అతడిలో అంతర్లీనంగా మాస్ టేస్ట్ ఉంటుందని ఆ టేస్ట్ ను తట్టి లేపడానికే తాను సినిమాలలో ఐటమ్ సాంగ్ పెడతాను అంటూ తెలివిగా సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ సుకుమార్ ఐటమ్ సాంగ్ కు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు భారీ అంచనాలు ఉన్న ‘పుష్ప’ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు టాక్.

ఇప్పటకే ఈ ఐటమ్ సాంగ్ ట్యూన్ ఫైనల్ అయిందని దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ ను ఈపాట కోసం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఐటమ్ సాంగ్ లో బన్నీ పక్కన రెచ్చిపోయి నటించడానికి దిశాపటాని నారా ఫతెహీ పేర్లను పరిశీలించినప్పటికీ ప్రస్తుతం స్ననీలియోన్ కు కేరళలో ఉన్న క్రేజ్ రీత్యా సుకుమార్ సన్నీలియోన్ వైపు మొగ్గుచూపుతున్నట్లు టాక్.

‘పుష్ప’ మూవీని మళయాళంలో అదేవిధంగా హిందీలో కూడ విడుదల చేస్తున్న పరిస్థితులలో స్ననీలియోన్ కు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ రీత్యా చివరకు ఆమెను ఫైనల్ చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు. అయితే కేవలం మూడు నిముషాలు పాటు ఉండే ఈ ఐటమ్ సాంగ్ కు సన్నీలియోన్ 75 లక్షల పారితోషికం డిమాండ్ చేస్తున్న పరిస్థితులలో ఆమెను ఎదో విధంగా 50 లక్షల పారితోషికానికి ఒప్పించే విధంగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో ‘పుష్ప’ మూవీకి ఏర్పడిన మ్యానియాకు సన్నీలియోన్ అదనపు ఆకర్షణగా మారుతూ ఉండటంతో ఈమూవీ పై మరింత మ్యానియా పెరిగే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: