బాలకృష్ణ హీరోగా మోహిని హీరోయిన్ గా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో 1991 జూలై 18 వ తేదీన విడుదలై ఈ మధ్యనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినిమా 'ఆదిత్య 369' ఈ సినిమా గురించి ఈ చిత్ర నిర్మాత అయిన శివలెంక కృష్ణప్రసాద్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు . మొదట ఈ సినిమా కథను బాలకృష్ణ గారికి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాడని కథ చాలా బాగుంది సినిమా చేద్దాం అని చెప్పాడు .
దానితో మేము కథకు సరిపోయే ఒక హీరోయిన్ కోసం చాలామంది హీరోయిన్ లానే అనుకున్నాం . దానిలో భాగంగా దివ్యభారతి ని కూడా సంప్రదించినట్లు ఇతర సినిమాల డేట్ లతో క్లాష్ రావడంతో , విజయ శాంతి ని తీసుకుందాం అని అనుకున్నాం కానీ బాలకృష్ణ తో అంతకుముందే చాలా సినిమాలు చేసి ఉండటంతో మరీ రొటీన్ అవుతుందనే ఉద్దేశంతో వేరే హీరోయిన్ ని ఎవరినైనా పెడదాం అని అనుకొని మోహిని తీసుకున్నాం. ఇలా అంతా పూర్తి అయ్యి సినిమా విడుదల అయ్యింది .
ఆ తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న సమయంలో చిరంజీవి గారు దూరదర్శన్ చానల్ లో రెండు నిమిషాల నిడివి గల ఒక వీడియోను విడుదల చేశారు.
అందులో చిన్నపిల్లలు టైం మిషన్ గురించి ఒక సినిమా వచ్చింది . ఇందులో మీరు వెళితే చాలా హాయిగా ఉంటుంది . ఏ కాలానికైనా వెళ్లొచ్చు అంటూ మా సినిమా గురించి ప్రమోషన్ చేశారు. అది మాకు చాలా కలిసివచ్చింది మా సినిమా కలెక్షన్లు పెరగడానికి కూడా చాలా సహాయ పడింది . హీరోయిన్ విజయశాంతి కూడా 'ఆదిత్య 369' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక వీడియోలో నటించినట్టు సినిమా నిర్మాత తెలిపాడు.