ఎంత డబ్బు సంపాదించిన కాని మంచి పేరు అనేది లేకుంటే ఆ డబ్బు అనేది వ్యర్థం.ఇప్పుడు దేశం మొత్తం కూడా
శిల్పా శెట్టి భర్తపైన వేలెత్తి చూపిస్తుంది. ఇతగాడు చేసిన ఘన కార్యం ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యి చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతుంది.పోర్న్ వీడియోలు తీసి యువతని పాడు చేస్తున్నాడనే కేసులో అరెస్టయిన
బాలీవుడ్ హాట్
బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పెద్ద పన్నాగమే పన్నాడు. ఇతగాడు పోలీసులు అరెస్టు చేయకుండా తప్పించుకోవడానికి రూ. 25 లక్షల లంచం చెల్లించాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ తెగ వైరల్ అవుతుంది.ఇక ఇదే కేసులో తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న
అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యాష్ ఠాకూర్ గత
మార్చి నెలలో ముంబైలోని అవినీతి శాఖ అధికారులకు పంపించిన ఈమెయిల్ లో ఈ విషయాన్ని వెల్లడించాడని సమాచారం అందింది. ఇక
మార్చి నెలలో ఏసీబీకి అతడు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడని ఇదే ఈమెయిల్ ను
ముంబై పోలీస్ కమిషనర్ కు
ఏసీబీ ఫార్వర్డ్ చేయడం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది.అయితే ఈ విషయంపైన స్పందన తెలియజేసేందుకు నగర పోలీసు అధికారులు నిరాకరించడం జరిగింది.
ఇక గత నెల అనగా
ఫిబ్రవరి 04వ తేదీనే పోర్న్ ఫిల్మ్ రాకెట్ కేసు నమోదు చేసినా
రాజ్ కుంద్రాని జూలై 19వ తేదీన పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.అయితే అంతకాలం వరకు కూడా
రాజ్ కుంద్రా అరెస్టు కాకుండా ఉన్నాడు.ముంబై క్రైమ్ బ్రాంచి అధికారులకు కుంద్రా లంచం ఇచ్చాడనే వార్తలపై ఎవరూ నోరు విప్పడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఏసీబీకి ఫిర్యాదు చేసిన కంపెనీ పేరు ప్లిజ్ మూవీస్. ఇది అమెరికాకు చెందిన కంపెనీ. దీనిని గతంలో న్యూ ఫ్లిక్ అని పిలిచేవారట.ఇక హాట్ షాట్స్ పేరిట ఓటిటి యాప్ ద్వారా పోర్న్ క్రియేట్ చేయడం..ఇక ఇందులో
రాజ్ కుంద్రా తెలివిగా వ్యవహరిస్తూ…లక్షలకు లక్షలు పొందాడని పోలీసులు భావిస్తున్నారు. హాట్ షాట్స్ తమ పాలసీకి ఉల్లంఘనే అంటూ
గూగుల్ ప్లే దానిని తీసివేశాక ఇతనికి ప్లాన్-బీ కూడా ఉందని పోలీసులు వెల్లడిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.