తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి అందరూ సినీ ప్రేక్షకులు తెలుసు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగానే కాకుండా నటన పరంగా కూడా ఆయన భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం నటించడం మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో తనకు ఉన్న ప్రతిభను బయటపెడుతూ ఉంటాడు. ఇలా ధనుష్ అనేక రంగాల్లో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. తాజాగా ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. అంతే కాకుండా హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ.... తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో కూడా ఆయన సినిమాలు రిలీజవుతున్నాయి.
మరో విషయం ఏంటంటే... స్టార్ హీరో ధనుష్ అతి త్వరలో హాలీవుడ్ సినిమా చేస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే ధనుష్ సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి ధనుష్ సినిమాను ప్రకటించాడు. అంతే కాకుండా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కూడా ధనుష్ ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. హాలీవుడ్ లో పాగా వేసేందుకు ధనుష్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడట.
ఇప్పటికే ధనుష్ హీరోగా చేస్తున్న అన్ని తమిళ్ మూవీలు హాలీవుడ్ లోకి డబ్ అవుతున్నాయి. కానీ అక్కడ డైరెక్టుగా సినిమా చేయాలని ధనుష్ ప్లాన్ చేస్తున్నాడట. అంతే కాకుండా ఇండియా వైడ్ గా గుర్తింపు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడట. ఇక మీదట ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటవెంటనే సినిమాలు చేయాలని ఆయన నిశ్చయించుకున్నాడట. ఇప్పటికే బాలీవుడ్ లో డైరెక్టుగా సినిమా చేసిన ధనుష్ అక్కడ తన నటనతో విమర్శకులు ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇప్పటికే వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ధనుష్ తన అభిమానులను పెంచుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.