మెగాస్టార్‌నే భయపెట్టిన ఒకే ఒక్క హీరోయిన్... చిరుయే ఒప్పుకున్నాడుగా ?
ఒక్క హీరోయిన్ మాత్రం చిరంజీవికి చెమటలు పట్టించేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు అలనాటి మేటి నటి రాధ. రాధాకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అన్న విషయాన్ని చిరంజీవి చెప్పారు. ఏదైనా ఒక సీన్ గురించి చెప్పినప్పుడు వెంటనే క్యాచ్ చేసి షాట్ షూటింగ్ కు రెడీ అయిపోయేదట. మిగిలిన హీరోయిన్ల విషయంలో మాత్రం చిరంజీవి ముందుగా షాట్ కోసం సెట్ లోకి వస్తే రాధ విషయంలో మాత్రం చిరంజీవి కాస్తంత ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని షాట్‌కు వచ్చేవారట.
రాధ ఏ సీన్ ను అయినా అంత స్పీడ్‌గా పట్టేసేదని రాఘవేంద్ర రావు కూడా చెప్పారు. ఇక డ్యాన్సుల విషయంలో కూడా చిరుతో పోటీ పడి మరీ ఆమె చేసేదట. ఏదేమైనా చిరంజీవికే చెమటలు పట్టించడం అంటే మామూలు విషయం కాదు. రాధా మామూలు హీరోయిన్ కాదనే చెప్పాలి.