స్విట్జ‌ర్లాండ్‌లో తొలి తెలుగు సినిమా షూటింగ్‌... మెగాస్టార్‌దే ఆ క్రెడిట్ ?

VUYYURU SUBHASH
తెలుగు సినిమా రంగ బ్లాక్ అండ్ వైట్ దశనుంచి కలర్ గా మారి ఈరోజు డిజిటల్ ప్రపంచంలో సరికొత్తగా దూసుకుపోతుంది. ఒకప్పుడు సినిమా షూట్ చేసి ప్రింట్లు వేసి థియేటర్లలో రిలీజ్ చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న ప్రక్రియ. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ప్రింట్లు వెళ్లడానికి రెండు రోజులు సమయం పట్టేది. అలాంటిది ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో కేవలం ఐదు నిమిషాల్లోనే సినిమా అన్ని థియేటర్లలో కి ఒకేసారి వెళ్ళిపోతుంది. ఇలా సినీ ప్రపంచం ప్రతి రోజు సరికొత్త మార్పులతో దూసుకుపోతోంది. 1970వ దశకంలో మనదేశంలో సినిమా షూటింగ్ లు అన్నీ ఇక్కడే జరిగేవి. అప్పట్లో విదేశాలకు వెళ్లి ఒక సినిమాను షూట్ చేయడం అంటే చాలా గొప్ప అన్నట్టుగా ఉండేది. ఎంత కష్టమైనా ఇక్కడే భారీ సెట్లు వేసి మరి సినిమాలను షూట్ చేసే వాళ్ళు.

తెలుగు సినిమాలు అన్ని చాలా వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రామోజీ ఫిలిం సిటీ లో మాత్రమే షూటింగ్ జరుపుకునే వి. అప్పట్లో సినిమా సాంగ్స్ కోసం మాత్రమే విదేశాలకు వెళ్లేవారు. స్విట్జ‌ర్లాండ్ లోని మంచు కొండల్లో పాటల షూటింగ్ అంటే అప్పట్లో ఓ సంచలనం. బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలను అప్పట్లో ఆ మంచు కొండల పై షూట్ చేసేవారు. అయితే తొలిసారిగా మెగా స్టార్ చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు సినిమాలో సాంగ్స్ షూట్‌ చేసేందుకు తొలిసారి వెళ్లారు.

స్విట్జ‌ర్లాండ్ లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా రౌడీ అల్లుడు రికార్డులకు ఎక్కింది. ఆ సినిమాలో చిరంజీవి - శోభన డ్యాన్స్ చేసిన చిలుకా క్షేమమా సాంగ్ ను దర్శకుడు కె.రాఘవేంద్రరావు అక్కడ మంచుకొండల్లో చిత్రీకరించారు. ఆ త‌ర్వాత ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఎన్నో సినిమాలు విదేశాల్లో షూటింగ్ చేసుకున్నాయి. రౌడీ అల్లుడు సినిమా నుంచే ఈ ట్రెండ్ ఎక్కువుగా స్టార్ట్ అయ్యింది. అలా ఈ ఘ‌న‌త చిరంజీవి ఖాతాలో ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: