ఆ హీరోతో రొమాన్స్.. ఎంతవరకు దారితీస్తుందో..?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో 'ఇస్మార్ట్ శంకర్'లో రొమాన్స్ చేసిన నభా నటేశ్‌కి అవకాశాలు వెల్లువెత్తాయి. చాందిని రోల్లో ఫుల్ మాస్‌గా కనిపించి యూత్ ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ మూవీస్ చేసింది. 'డిస్కోరాజా'లో రవితేజతో కలిసి ఆడిపాడింది. నభా నటేశ్ 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత చేసిన సినిమాలు ఊహించిన విధంగా సక్సెస్ సాధించలేదు. 'డిస్కోరాజా' ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంటే..'సోలో బ్రతుకే సో బెటర్'కి పర్వాలేదని పించింది. ఇక బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో కలిసి చేసిన 'అల్లుడు అదుర్స్' నభాని ఊహించని షాక్ కు గురిచేసింది.
నభా నటేశ్ ప్రస్తుతం నితిన్‌తో కలిసి 'మ్యాస్ట్రో' సినిమా చేస్తోంది. 'అంధాదున్' రీమేక్‌గా వస్తోన్న ఈ మూవీలో రాధిక ఆప్టే క్యారెక్టర్ని రీప్లేస్ చేస్తోంది నభ. ఇక గ్రాఫ్ పడిపోతోన్న సమయంలో ఈ 'మ్యాస్ట్రో' సినిమాపై నభ చాలా హోప్స్ పెట్టుకుంది. మరి 'మ్యాస్ట్రో' నభ కెరీర్‌ని ఎటువైపు తీసుకెళ్తాడో చూడాలి. నితిన్ తో రొమాన్స్ ను యాక్సెప్ట్ చేస్తారో లేదో మరి.