తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎదిగిన సునీల్ 'అందాలరాముడు' సినిమా తో సోలో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'మర్యాద రామన్న' సినిమాతో ఈ హీరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా విజయంతో హీరో పాత్రలు మాత్రమే వేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత 'పూలరంగడు' సినిమాలో తన కొవ్వు నంతా కరిగించి సిక్స్ ప్యాక్ తో తెలుగు ప్రేక్షకులకు కనిపించి మరొక విజయాన్ని కూడా అందుకున్నాడు.
ఈ సినిమా వరకు హీరోగా సునీల్ కెరీర్ బాగానే నడిచింది. కానీ ఆ తర్వాత వరుసపెట్టి ఎన్ని సినిమాల్లో హీరోగా నటించిన విజయాలు మాత్రం దక్కలేదు. దానితో ఈ నటుడు కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితమైతే కష్టం అని నిర్ణయానికి వచ్చి ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధపడ్డాడు. దానిలో భాగంగానే అరవింద సమేత ,చిత్రలహరి సినిమాలో కామెడి గా కనిపించాడు. మరి కొంత కొత్తగా తనలో ఉన్న ఒక వైవిధ్యమైన నటుడి ని తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు డిస్కో రాజా, కలర్ ఫోటో సినిమాలలో విలన్ గా కూడా చేశాడు. ప్రస్తుతం ఈ హీరో పుష్ప, ఎఫ్3 సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. దీనితోపాటు థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న 'కనబడుట లేదు' అనే సినిమాలో మెయిన్ లీడ్ రోల్ లో కనిపించబోతున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన 'టీజర్' ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంటోంది. తాజాగా ఈ హీరో చేసిన పోస్ట్ సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. రెడ్ కలర్ లో ఉన్న ఒక ఫోటోను 'రెడ్ అలర్ట్' అంటూ పోస్ట్ చేశాడు .నా తదుపరి అప్డేట్ కోసం వేచి చూడండి అంటూ రాసుకొచ్చారు. ఇది మరి సినిమాకు సంబంధించిన అప్డేట్ కాదో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.