తరుణ్ భాస్కర్ కు షాక్ ఇచ్చిన వెంకటేష్ కామెంట్స్ !
అయితే ఇప్పుడు ఈవార్తలను వెంకటేష్ తన కామెంట్స్ తో గాలి వార్తలుగా తేల్చిపారేసాడు. ఈ వారం ఓటీటీ లో విడుదల కాబోతున్న ‘నారప్ప’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు. తరుణ్ భాస్కర్ తో తాను మూవీ చేయబోతున్నాను అంటూ వచ్చిన వార్తలు ఖండిస్తూ ఈ వార్తలు అన్నీ మీడియా సృష్టి మాత్రమే అంటూ జోక్ చేసాడు.
ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ కోవిడ్ పరిస్థితులు తరువాత ఇండస్ట్రీలో చాల మార్పులు వచ్చాయని ఆ మార్పులకు తగ్గట్టుగా ఎవరైనా మారి తీరవలసిందే అని కామెంట్స్ చేసాడు. రానున్న రోజులలో ప్రేక్షకులు కొన్ని సినిమాలను ఓటీటీ లోను మరికొన్ని సినిమాలను ధియేటర్లలోను చూసే అలవాటు చేసుకుంటారని ఇలాంటి పరిస్థితులలో ఇండస్ట్రీకి సంబంధించి ఫిలిం మేకింగ్ లో కూడ చాల మార్పులు రాబోతున్న విషయం తనకు తెలుసు అంటూ వెంకీ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో జరుగుతున్న అంతర్మధనాన్ని సూచిస్తోంది.
ఇక ‘నారప్ప’ మూవీ గురించి మాట్లాడుతూ ఈమూవీ ధియేటర్లలో కాకుండా ఓటీటీ లో విడుదల అవుతున్నందుకు తనకు బాధగానే ఉన్నప్పటికీ తాను ఓటీటీ హీరోగా మారిపోతున్నాను అన్న దిగులు తనకు లేదు అంటూ కామెంట్స్ చేసాడు. తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించినా ‘నారప్ప’ మూవీలోని తన పాత్ర గురించి తాను చాల కష్టపడవలసి వచ్చింది అన్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు..