అషు రెడ్డి ట్రయాంగిల్ లవ్ స్టోరీ..!
జస్ట్ స్కిట్ లో మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా హరితో అషు రెడ్డి చేస్తున్న హంగామా ఆడియెన్స్ కు డౌట్ వచ్చేలా చేస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉన్న అషు రెడ్డి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. లేటెస్ట్ గా ఫ్యాన్స్ తో చాట్ చేసిన అషు రెడ్డి రాహుల్, హరిలతో రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి సమాధానంగా వారిద్దరు రెండు కళ్లు అన్నట్టు చెప్పింది అషు రెడ్డి. అంతేకాదు ఆ ఇద్దరిలో ఒకరంటే నాకు ఇష్టం ఒకరికి నేను ఇష్టమని ట్రయాంగిల్ లవ్ స్టోరీ కహాని చెప్పింది అషు.
బిగ్ బాస్ వల్ల వచ్చిన ఫాలోయింగ్ తో ఆమె సోషల్ మీడియాలో ఇంకాస్త క్రేజ్ తెచ్చుకుంది. అయితే కెరియర్ పరంగా మాత్రం అషు రెడ్డి ఇంకా స్మాల్ స్క్రీన్ మీదే ఆగిపోయింది. ఆమె ఓకే అంటే చాలు కాని హీరోయిన్ గా ఛాన్సులు ఇవ్వడానికి రెడీ అయ్యారు. కాని అషు రెడ్డి ఎందుకో వెనక్కి తగ్గుతుంది. అషు ఫ్యాన్స్ మాత్రం ఆమెను హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఆశిస్తున్నారు.