విజయ్ దేవరకొండ, సుకుమార్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ?
.విజయ్ పెళ్లి చూపులు సినిమాకు ముందు నాగ్ అశ్విన్ తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానితో కలిసి నటించాడు. ఆ సినిమా విజయ్ కు మంచి నటుడుగా గుర్తింపు తెచ్చింది. తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటిలో కూడా మంచి పాత్ర పోషించాడు.ఇది ఇలా ఉండగా స్టార్ హీరోల సరసన చేరాలంటే మాస్ ఇమేజ్ ఉండాలని గుర్తించిన విజయ్ మాస్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తో కలిసి లైగర్ అనే మాస్ మూవీ చేస్తున్నాడు. ఏ హీరోని అయిన మాస్ లుక్ లో చూపించే పూరిజగన్నాథ్ విజయ్ ని ఎలా చూపిస్తాడో చూడాలి. ఇది ఇలా ఉంటే స్టైలిష్ డైరెక్టర్ అయిన సుకుమార్ తో తన తరువాత మూవీ ఉండబోతుంది అని ఆ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న అని విజయ్ ప్రకటించాడు. సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అయిన కియారా అద్వానీ నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. హీరోలను స్టైలిష్ లుక్ లో చూపించే సుకుమార్ విజయ్ ని ఎలా చూపుస్తాడో చూడాలి. సుకుమార్ ప్రస్తుతం అల్లుఅర్జున్ హీరోగా పుష్ప అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి కాగానే విజయ్ దేవరకొండతో మూవీని అధికారికంగా అనౌన్స్ చేయనున్నాడు.