వాణిశ్రీ మొద‌ట్లో ఆ పేరుతో నటించారంట.. మీకు తెలుసా..!?

N.ANJI
వాణిశ్రీ అంటే మన అమ్మలకు, అమ్మమ్మలకు తెలియకుండా ఉండదు. కామెడీ క్యారెక్టర్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాణిశ్రీ..పద్మనాభం, రాజనాల సరసన నటించారు. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. మొదట అదే పేరుతో నటించారు. 1962లో సోమవార వ్రత మహత్యం సినిమా ఘూటింగ్ జరుగుతూ ఉండగా రత్నకుమారికి మేకప్ వేసి సెట్ కు తీసుకెళ్లారు. దర్శకుడు కృష్ణస్వామి సహకారంతో కొన్ని ఫోటోలు .చిత్రీకరించి.. ఆ తరువాత ఫొటోగ్రాఫర్ నాగరాజురావు చేత కొన్ని స్టిల్స్ తీయించారు.

వాణిశ్రీని చూడగానే కృష్ణస్వామి, నాగరాజరావు ఇద్దరూ తను సినిమాలకు పనికిరాదని ఖరాకండీగా చెప్పేశారు. ఆ తర్వాత కొద్దికాలానికి కాంతారావు సరసన రణభేరి సినిమాలో హీరోయిన్ గా వాణిశ్రీ నటించారు. వ్యాంప్ క్యారెక్టర్కు రాజశ్రీని తీసుకున్నారు. ఆ మూవిలో వ్యాంప్ క్యారెక్టర్ రాణిస్తూనే సినిమా రాణిస్తుంది. దాంతో కాంతారావు నిర్మాతకు చెప్పి హీరోయిన్ గా రాజశ్రీని, వ్యాంప్ క్యారెక్టర్ కు వాణిశ్రీని పెట్టారు. అప్పుడు అందరు అతనిమీద విరుచుకుపడ్డారు. అబాండాలు వేశారు.  కానీ సినిమా విడుదల అయిన తరువాత అందరూ కాంతరావు నిర్ణయం కరెక్ట్ అని ఒప్పుకున్నారు.

ఆ తరువాత ఆకాశరామన్న సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ పోషించారు వాణిశ్రీ.  అలానే చేస్తుండగానే.. ఎప్పుడు ఇవే పాత్రలేనా అని తాను భాదపడేవారట. కాంతరావు ఆమెకు సర్థిచెప్తూ.. త్వరలోనే హీరోహీరోయిన్లుగా కలుసుకుంటాం అని చెప్పుకొచ్చేవాడు. ఆ మాటే నిజమైంది. దేవుని గెలిచిన మానవుడు చిత్రంలో కాంతరావు సరసన వాణిశ్రీ హీరోయిన్ గా నటించారు. ఆ తరువాత కృష్ణతో మరుపురాని కథలో హీరోయిన్ గా చేశారు.

అలా మొదలైన వాణిశ్రీ కొద్దిరోజులకే స్టార్ హీరోలంతా వాణిశ్రీయే తన సరసన నాయికగా చేయాలని అడిగే వరకూ ఆమె ఎదిగారు. మహానటి సావిత్రి తరువాత ఆ తరంలో నంబర్ వన్ వాణిశ్రీ. అంత మంచి పేరు సంపాదించుకున్నారు. స్టైల్ ఐకాన్ మారింది. అభిమానులకు వాణిశ్రీ కొప్పు, వాణిశ్రీ చీరలు,కట్టూ బొట్టూ అంటే బాగా ఇష్టం.  అలా ఆమె కష్టాలను అధిగమిస్తూ అంత స్థాయికి చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: