సూర్యకు ఈ సారి నిరాశ తప్పేలా లేదే ?

VAMSI
మాములుగా ఒక భాష నుండి మరొక భాషలోకి హీరోల సినిమాలు విడుదలవ్వడం చూస్తూ ఉంటాము. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమకు మరియు తమిళ సినీ పరిశ్రమకు మధ్యన ఎక్కువ సంబంధాలు ఉంటాయి. తెలుగు హీరోల సినిమాలు అక్కడ విడుదలయ్యేది చాలా అరుదు. కానీ కొందరి తమిళ హీరోల సినిమాలు ఖచ్చితంగా అక్కడ రిలీజ్ అయ్యాయంటే తెలుగులోనూ విడుదల కావాల్సిందే. ఆ రేంజ్ లో వారికి కూడా తెలుగులో అభిమానులున్నారు. అటువంటి హీరోలలో రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విజయ్, అజిత్, ధనుష్, కార్తీ మరియు విజయ్ సేతుపతి లు ఉన్నారు. వీరికి టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. ఇది ఇలా ఉంటే సూర్యకు ఆకాశమేనీ హద్దురా సినిమాకు ముందు కెరీర్ ప్రమాదంలో పడేంతలా ఉండేది. కానీ ఈ సినిమా అనంతరం మళ్ళీ పుంజుకున్నాడు.
ఈ సినిమా తెలుగులోనూ నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సూర్య హీరోగా త్వరలో విడుదల కానున్న మరొక్క సినిమాను కూడా తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ సినిమాపై పలు రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సినిమా తమిళ్ లో హిట్ అయినంతగా తెలుగులో హిట్ అవ్వకపోవచ్చనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు. దీనికి కారణం చూస్తే, ఈ సినిమా దర్శకుడు వెట్రిమారన్ సినిమాలలో ఎక్కువగా తమిళ్ నేటివిటీ ఉంటుంది. తెలుగు లో డబ్బింగ్ చేసి వదిలినా తమిళ నేటివిటీని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు స్వాగతిస్తారన్నది ప్రశ్నగా మిగిలిపోయింది.

 ఇది ఒక కారణమయితే ఈ సినిమా తమిళులు ఎంతగానో ఇష్టపడే జల్లి కట్టు ఆటను ప్రధానాంశముగా తీసుకుని తెరకెక్కించినట్లుగా ఇటీవల విడుదల చేసిన పోస్టర్ ను బట్టి అర్ధమవుతోంది. ఈ జల్లి కట్టు ఆట గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా అవగాహన లేదు. అంతే కాకుండా ఆదరించకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇప్పటికే సూర్య మార్కెట్ మళ్ళీ పుంజుకుంటోంది, ఇప్పుడు మళ్ళీ ఈ కాన్సెప్ట్ తో సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే ఇబ్బందిపడే అవకాశం ఉంది. మరి సినిమా బృందం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ తెలుగులో రిలీజ్ చేయాలి అనుకుంటే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సన్నివేశాలను మారిస్తే బాగుంటుందని తెలుగు సినిమా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: