మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ చిత్రానికి మరోసారి నిర్మాణ బాధ్యతలు చేపట్టడానికి నాగబాబు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నాగబాబు నిర్మాణంలో, చెర్రీ హీరోగా తెరకెక్కిన ఆరెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో అప్పట్లో తనను మళ్లీ ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత నాదే అంటూ రామ్ చరణ్ చెప్పినట్లుగా వార్తలు ప్రచారం కాగా, ఇప్పుడు మాట నిలబెట్టుకునేందుకే ఓ మంచి కథకు ఓకే చెప్పిన చెర్రీ ఆ సినిమాకు నిర్మాతగా తన బాబాయ్ నాగబాబు ఉండాలని భావించడంతో ఈ న్యూస్ బయటకు వచ్చినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి. ఓ వైపు ప్రస్తుతం సొంత నిర్మాణంలో వరుస సినిమాలు తెరకెక్కిస్తున్నప్పటికీ బాబాయ్ కి ఇచ్చిన మాట కోసం ఈ ఆఫర్ ను నాగబాబు చేతిలో పెట్టారట చెర్రీ.
అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది అనేది ఇప్పటికీ సస్పెన్స్. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నాగబాబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, నటుడిగా, నిర్మాతగా సినిమాలను చేస్తూ ప్రఖ్యాతి పొందారు. అంజనా ప్రొడక్షన్స్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు నాగబాబు అధినేత అయిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆరెంజ్ చిత్రం నాగబాబును నిర్మాతగా కృంగదీసింది. ఎన్నో అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో నాగబాబు ఈ మూవీ నిర్మించగా సినిమా ఫలితం డిజాస్టర్ కావడంతో ఆర్థికంగా తీవ్రస్థాయిలో నష్టపోయారు. దీంతో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచనకు కూడా వచ్చినట్లు పలుమార్లు ఇంటర్వ్యూలో ప్రస్తావించారు నాగబాబు.
అయితే అప్పట్లో అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆర్థికంగా సహాయం పడటంతో నష్టాల్లో నుంచి కాస్త గట్టెక్కి నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాను క్లాసిక్ అని అభివర్ణించే అభిమానులు కూడా ఎక్కువే. అప్పట్లో రామ్ చరణ్ ఇచ్చిన మాట కారణం గానే ఇప్పుడు తన మరో చిత్రానికి బాబాయి నిర్మాతగా నిలబెట్టాలని చెర్రీ డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆరెంజ్ మూవీ డిజాస్టర్ తర్వాత సినిమాలు నిర్మించడానికి కనీసం ఆసక్తి కూడా చూపని నాగబాబు ఇప్పుడు చెర్రీ తో మరో సినిమా చేసి సక్సెస్ ను అందుకోవలనుకుంటున్నారట నాగబాబు.