మహేష్ బాబు కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు ఎంత ఇష్టమో మనకు తెలిసిన విషయమే. ఈయన తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఇక తన నాన్న లాగే ఈయన కూడా తన ప్రతి సినిమాలో సరికొత్త లుక్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే మహేష్ బాబు యొక్క ఆస్తి విలువ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రిన్స్ మహేష్ బాబును ఊరకనే ప్రిన్స్  అని పిలవరు. తనకు ఉన్న  నట వ్యాపార సామ్రాజ్యం ప్రకారమే.. ఆయనను ప్రిన్స్ అని పిలుస్తారు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చినా "రాజకుమారుడు".. ఈ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. ఇక ఆ తర్వాత ఎన్నో ఫ్లాప్ లను  చవి చూశారు. ఇక తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమాతో మంచి హిట్ కొట్టారు.
ఆ తర్వాత కేవలం పెద్ద దర్శకులను తోనే సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఇక గుణశేఖర్ తో ఒక్కడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. ఇక నిజం సినిమాతో కూడా ఉత్తమ నటుడు అవార్డు ని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత అతడు, పూరి జగన్నాథ్ తీసిన పోకిరి సినిమాలు ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను  తిరగ రాశాయి. ఇక ఆ తరువాత దూకుడు, బిజినెస్ మ్యాన్,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలతో మంచిహిట్  అందుకున్నాడు మహేష్ బాబు.

ఇక ఈ సినిమాలతో మహేష్ బాబు ఇప్పుడు ఏకంగా ఒక్కో సినిమాకి 25 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. ఇక మహేష్ బాబు ఆస్తుల విషయానికి  వస్తే.. నమ్రతా  2500 కోట్ల రూపాయల ఆస్తి తో అడుగు పెట్టింది మహేష్ బాబు ఇంట. ఇక తనతోనే మహేష్ బాబు కు  అదృష్టం వచ్చిందని సినీ ఇండస్ట్రీలో వినికిడి. ఇక మహేష్ బాబు యాడ్స్ లో నటించే ఒక సంవత్సర  వార్షికాదాయం ఎంత అంటే 180 కోట్ల రూపాయలు. ఇక శ్రీమంతుడు సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టిన మహేష్ బాబు. ఈ సినిమా ద్వారా కొన్ని కోట్ల రూపాయల లాభం పొందాడు. ఇక మహేష్ బాబు కు మల్టీప్లెక్స్ లు కూడా ఉన్నాయి. దీనితో కూడా మంచి లాభాలు పొందుతున్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబు 80 కోట్ల రూపాయల విలువ చేసే ఇంట్లో హైదరాబాదులో ఉన్నాడు. ఇక ఇలాంటి ఇల్లే హైదరాబాదులో మరొకటి కూడా ఉంది. ఇక చెన్నైలో కూడా రెండు ఇల్లులు ఉన్నాయి. వాటి విలువ సుమారుగా 100 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక మహేష్ బాబు షూటింగ్ సమయాలలో వాడే కార్వాన్ విలువ 35 కోట్ల రూపాయలు. ఇక మహేష్ బాబు  దగ్గర 3 ఖరీదైన కార్లు ఉన్నాయి, ఇక బంగారం, ప్లాటినం, సిల్వర్ విషయానికి వస్తే..10 పది కేజీల పైన ఉంటుందని అని అనుకుంటున్నారు. ఇక మహేష్ బాబు మొత్తం ఆస్తి విలువ కలిపితే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: