లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల ఫస్ట్ ఛాయస్ సాయి పల్లవి కాదా?

VAMSI
నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన "లవ్ స్టోరీ" సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఓ తాజా వార్త అందరికీ షాక్ ఇస్తోంది. మొదట ఈ మూవీలో చైతు పక్కన హీరోయిన్ గా సమంతని అనుకున్నారట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఇది లవ్ స్టోరీ కావడంతో వీరి కెమిస్ట్రీ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని భావించారట. అందుకని మొదట హీరోయిన్ గా నటించమని సమంత సంప్రదించగా, ఆమె ఆల్రెడీ సైన్ చేసిన సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ ఖాళీగా లేక నో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి సామ్ కాస్త ఫీల్ అవుతున్నారట.

 
ఇంత అద్భుతమైన చిత్రాన్ని అందులోనూ చైతు పక్కన నటించే అవకాశాన్ని మిస్ అయ్యానంటూ ఫీల్ అవుతున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇదేదో మొదట్లోనే ఏదోలా డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఉండి ఉంటే బాగుండేదని సామ్ చాలా ఫీల్ అవుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. ఒకవేళ ఈ సినిమాలో కనుక నిజంగా సమంత కనుక చైతు పక్కన కనిపించే ఉంటే ఫ్యాన్స్ కు మరో స్పెషల్ సప్రైజ్ దక్కి ఉండేది. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవిల తాజా చిత్రం లవ్ స్టోరీ. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ అందమైన ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించారు.  షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

 ఇప్పటికే ఈ సినిమా హక్కుల కోసం చాలా ఓటిటీ వేదికలు ఫ్యాన్సీ ఆఫర్లు ఇచ్చినా, దర్శక నిర్మాతలు ఏ ఆత్రం టెంప్ట్ అవ్వకుండా నేరుగా థియేటర్లలోనే  రిలీజ్ చేయాలని వెయిట్ చేస్తున్నారట. ఇటీవల రిలీజ్ అయిన  పాటలు, ప్రోమోలు సినిమాపై  అంచనాలను రెట్టింపు చేశాయి. టాలీవుడ్ లో ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రంలో సాయి పల్లవి మరో హైలెట్ గా నిలిచింది. అంతా అనుకుంటున్నట్లుగా ఈ సినిమా అంచనాలను అందుకుని మరో బెస్ట్ లవ్ స్టోరీ గా నిలుస్తుందా ? అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: