బాలీవుడ్ సూపర్ స్టార్ లు ఒకే సినిమాలో కలిస్తే ?
బాక్సాఫీస్ వద్ద తమ స్టార్ డం ప్రభావాన్ని చూపే ఈ ఇద్దరు కథానాయకులు చేయబోతున్నారు అంటే ఆ లెక్కే వేరు. ఈ క్రేజీ కాంబో చిత్రానికి రాఖీ అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకుడు నిర్మాత ఎవరు అనే విషయాలు త్వరలో తెలియనున్నాయి. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పేరు వినిపిస్తోంది. మరి రెండవ హీరోయిన్ గురించి ఇంకా వేటలోనే ఉన్నారని సమాచారం. షారుఖ్ మరియు సంజయ్ దత్ కు మధ్యన సత్సబంధాలు ఉన్నాయని , వీరిద్దరూ మంచి స్నేహితులని చాలా సార్లు విన్నాం. అయితే ఇప్పుడు ఈ మూవీతో వెండితెరపై ఈ ఇద్దరిని కలిసి చూసే అవకాశం లభించబోతుండడం విశేషం.
గతంలో కూడా బ్లాక్ బాస్టర్ మూవీ "ఓం శాంతి ఓం" లో ఓ పాటలో షారుఖ్ ఖాన్ తో సంజయ్ దత్ కలసి కాలు కదిపి ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ఎక్కువ నిడివితో సంజయ్ నటించబోతున్నారని సమాచారం. మరి ఈ సినిమా షూటింగ్ మరియు ఇతర అప్ డేట్స్ త్వరలోనే తెలియనున్నాయి.