పవన్ సరసన నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇకపోతే అటు రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక మొదటి సారి "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు.ఈ సినిమాకి దర్శకుడు ఈ వీ వీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఇక పవన్ కళ్యాణ్ బావ అయిన అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమా "ఖయామత్ సే ఖయామత్ తక్ "అనే హిందీ మూవీ నుంచి రీమేక్ అయి పవన్ కళ్యాణ్ మొదటి చిత్రంగా తెరకెక్కింది.1996 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొని, డెబ్యూ స్టార్ గా ఎదిగాడు పవన్ కళ్యాణ్ .
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక అమ్మాయి నటించింది.ఆమె ఎవరో కాదు.. లెజెండ్రీ యాక్టర్ గా గుర్తింపు పొందిన అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు, ఇక నాగార్జున మేనకోడలు అలాగే హీరో సుమంత్ కి స్వయానా చెల్లెలు అయిన సుప్రీత. ఇక సుప్రీత.. చరణ్ రెడ్డి ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇష్టం సినిమా ద్వారా పరిచయమైన చరణ్ రెడ్డి, సుప్రీత తో గొడవలు జరిగి, విడాకుల వరకు వెళ్లి, చివరకు పూర్తిగా మనస్తాపం చెంది , ఆత్మహత్య చేసుకున్నారు.