లాయర్ పాత్రలో కనిపించబోతున్న హాట్ హీరోయిన్?
దీంతో రాధిక ఆప్టే కి సంబంధించిన ఎన్నో హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియా ను షేక్ చేస్తూ ఉంటాయి. అయితే అటు సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ఉంటుంది. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా.. డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు ఎన్నో రకాల విభిన్నమైన పాత్రలలో అలరించిన ఈ హాట్ హీరోయిన్ మరికొన్ని రోజుల్లో ఏకంగా నల్లకోటు వేసుకోపోతుందట. ఓ సినిమాలో లాయర్ పాత్రలో రాధికా ఆప్టే నటించబోతున్నట్లు ఇటీవల ఓ టాక్ వినిపిస్తోంది. ఇక లాయర్ పాత్రలో రాధిక ఆప్టే ఎలా మెప్పించ పోతుందో అని అటు అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
తమిళంలో విక్రమ్ వేద అనే మూవీ ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమా హిందీ రీమేక్లో రాధిక ఆప్టే ఒక లాయర్ పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమాలో ప్రధానపాత్రలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. మాధవన్ నటించారు అయితే ఈ సినిమా హిందీ రీమేక్లో విజయ్ సేతుపతి పాత్రలో హృతిక్ రోషన్.. మాధవన్ పాత్రలో సైఫ్అలీఖాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళంలో విక్రమ్ వేద అనే సినిమాను తెరకెక్కించిన దర్శకులే హిందీ రీమేక్ ని కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.