గోపిచంద్ - శ్రీవాస్ సినిమాలో కెజిఎఫ్ విలన్ ?

VAMSI
సినిమా పరిశ్రమలో కొందరు హీరోలు మరియు డైరెక్టర్ ల కాంబినేషన్ చాలా బాగా కలిసొస్తుంది. వీరి కాంబోలో మూవీ అంటే చాలు ఖచ్చితంగా హిట్ అవుతుందనే ఫీల్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇందులో త్రివిక్రమ్ - అల్లు అర్జున్, మహేష్ - పూరి జగన్నాధ్, శ్రీవాస్ - గోపిచంద్ లు ఉన్నారు. ఈ కారణంగానే మళ్ళీ కలిసి సినిమా చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు గోపిచంద్ మరియు శ్రీవాస్ ముచ్చటగా మూడోసారి కలిసి సినిమా చేయనున్నారు. దీనికి సంబంధిచిన అధికారిక ప్రకటన ఇప్పటికే విడుదల చేసింది చిత్ర బృందం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం మరియు లౌక్యం సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
అవి రెండూ కూడా ఫ్యామిలీ కథా చిత్రాలుగా వచ్చి సక్సెస్ అయ్యాయి. ఈ మూడవ చిత్రం కూడా అదే జోనర్ లో ఉంటుందా లేదా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తారా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగక తప్పదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మిగిలిన పాత్రల కోసం అప్పుడే వేట మొదలెట్టినట్టున్నారు. మిగిలిన పాత్రలెలా ఉన్నా, విలన్ పాత్ర కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కెజిఎఫ్ సినిమాలో గరుడగా నటించిన రామ్ ని విలన్ గా  నటింపచేసేందుకు మంతనాలు జరుగుతున్నాయి.

 ఒక్క సినిమాతోనే అందరి డైరెక్టర్ ల దృష్టిలో పడిన గరుడ రామ్ ఇప్పటికే అజయ్ భూపతి మహాసముద్రంలో విలన్ గా చేసిన విషయం తెలిసిందే. ఇది కాకుండా మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు గోపీచంద్ తో తలపడడానికి శ్రీవాస్ ప్రయత్నిస్తున్నాడట. మరి ఈ వార్త నిజమయితే ఈ సినిమాకు ఇదే పెద్ద హైప్ అయ్యే అవకాశం ఉంది. మరి గరుడ రామ్ ఒప్పుకుంటాడా ? యాక్షన్ చిత్రాలను చేస్తున్న గరుడ రామ్ ఫ్యామిలీ చిత్రానికి అంగీకరిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: