దుల్కర్ సల్మాన్ సినిమాలో సుమంత్.. అయ్యో పాపం అంటున్న ఫ్యాన్స్..?

Suma Kallamadi
అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున అల్లుడైన సుమంత్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి సర్వ శక్తులూ ఒడ్డి ప్రయత్నిస్తున్నారు కానీ ప్రతిసారి విఫలం అవుతున్నారు. సత్యం సినిమాతో ప్రేక్షకులను బాగా అలరించిన ఆయన "మళ్లీ రావా" సినిమాతో బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ రెండు చిత్రాలు మినహాయించి ఆయన చేసిన మిగతా సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను వీసమెత్తు అయినా అలరించలేదు. 2021 లో వచ్చిన కపటధారి సినిమా కూడా ఆయనకు నిరాశే మిగిల్చింది. దీంతో సోలో హీరోగా సినిమా చేస్తే హిట్స్ రావని సుమంత్ కి అర్థమైనట్లు తెలుస్తోంది. హీరోగా అనేక సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి కూడా సిద్ధమవుతున్నారు. దీంతో అక్కినేని అభిమానులు ఉసూరుమంటున్నారు. అక్కినేని వారసత్వాన్ని నిలబెట్టడానికి నాగచైతన్య తప్ప మరెవరూ కనిపించడం లేదని ఇప్పటికే అభిమానులు నిరాశ నిస్పృహల మధ్య తేలుతున్నారు. ఇటువంటి సమయంలో సుమంత్ సైడ్ క్యారెక్టర్ చేయాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

అయితే తాను ఎలాగూ హీరోగా రాణించలేకపోతున్నానని డిసైడ్ అయిపోయిన సుమంత్ మంచి ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చేయడానికి మాత్రం సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరమీదికి వచ్చింది. అదేంటంటే, అమ్మాయిల రాకుమారుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించడానికి సుమంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక పిరియాడిక్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో సుమంత్.. హీరో స్నేహితుడిగా, ఒక సైనికుడిగా నటించనున్నారట. దుల్కర్ సల్మాన్ ప్రేమను గెలిపించేందుకు సుమన్ తన ప్రాణాలను సైతం త్యాగం చేస్తారట. సెకండాఫ్ లో సుమంత్ సన్నివేశాలు ఆద్యంతం భావోద్వేగంగా ఉంటాయని తెలుస్తోంది.

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో దుల్కర్ సల్మాన్ సినిమాకి సంబంధించి భారీ సెట్ నిర్మించాలని సమాచారం. 1964 బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ ఎంటర్టైనర్ ని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌ నిర్మిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: