మనకిప్పుడు వాళ్లతో పనిలేదు..!
తమిళనాట డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్స్ అందుకున్న సముద్రఖని, ఇక్కడ విలన్‌గా బిజీ అవుతున్నాడు. 'అల వైకుంఠపురములో' అప్పల నాయుడుగా డిఫరెంట్ మేనరిజమ్స్ చూపించిన సముద్రఖని, 'క్రాక్'లో కటారి కృష్ణగా హైలెట్ అయ్యాడు. ఇప్పుడు మహేశ్ బాబు 'సర్కారు వారి పాట'లో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.
బెస్ట్ పెర్ఫామర్‌గా కోలీవుడ్ లో సూపర్ స్టార్డమ్ ఉన్న హీరో విజయ్ సేతుపతి. జానర్‌తో సంబంధం లేకుండా ప్రతీ సినిమాతో మాయ చేస్తోన్న సేతుపతి, తెలుగులో మాత్రం విలన్ రోల్స్‌కి హీరోయిజం తెచ్చిపెడుతున్నాడు. 'ఉప్పెన'లో రాయణం పాత్రతో బోల్డంత రెస్పాన్స్ తెచ్చుకున్న సేతుపతికి క్రేజీ ఆఫర్స్ ఇస్తున్నారు తెలుగు మేకర్స్.
తమిళ ఆర్టిస్ట్ వరలక్ష్మి శరత్‌కుమార్‌కి అక్కడి కంటే ఇక్కడే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. బేస్ వాయిస్‌తో పవర్‌ఫుల్‌గా కనిపించే వరలక్ష్మికి బలమైన క్యారెక్టర్స్ ఇస్తున్నారు దర్శకులు. 'క్రాక్' సినిమాలో జయమ్మ పాత్రతో విలనిజం చూపించిన వరలక్ష్మి 'నాంది'లో లాయర్ ఆద్యగా అదరగొట్టింది. ఇక ఈ రెస్పాన్స్‌తో వరలక్ష్మి తెలుగులో మరింత బిజీ అవుతోంది.
నాని 'టక్‌జగదీష్' సినిమాలో కూడా తమిళ ఆర్టిస్ట్‌నే విలన్‌గా తీసుకున్నారు. 'ఘర్షణ' లాంటి సినిమాల్లో విలన్‌గా నటించిన డానియల్ బాలాజీ 'టక్ జగదీష్'లో విలన్‌గా చేశాడు. మరి తెలుగులో తమిళ విలన్స్ పెరగడానికి మార్కెట్ లెక్కలే కారణమని చెప్పొచ్చు. తమిళ స్టార్స్ ఉంటే అక్కడ బిజినెస్ పెరిగే అవకాశముంది. అందుకే తెలుగు సినిమాల్లో తమిళ విలన్స్ ఎక్కువవుతున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో తమిళ విలన్ లు పెరిగిపోతున్నారు. వాళ్ల యాక్టింగ్ ను మనోళ్లు మెచ్చుకోక ఉండలేకపోతున్నారు.