జాన్వీ కపూర్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో ?
బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఒక హీరోయిన్ గా స్థిరపడడానికి ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్కును ఏర్పరుచుకుంది. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని ముందుకు సాగుతోంది. ఇటీవలే టాలీవుడ్ లోనూ నటించనుంది అని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ కి సంబంధించిన వార్తొకటి అన్నా చెల్లి మధ్యన ఉండే అనుబంధాన్ని చూపుతోంది. అయితే ఇంతకీ ఏమి జరిగిందో ఒకసారి చూద్దాం. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కి ఇద్దరు భార్యలని అందరికీ తెలిసిన విషయమే. బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరికి ఇద్దరు పిల్లలున్నారు. వారిలో బాలీవుడ్ యువ హీరో అర్జున్ కపూర్ కొడుకు మరియు అన్షుల్లా కపూర్ ఉన్నారు.
కొన్ని కారణాల వలన మొదటి భార్యతో బోనీ కపూర్ విడిపోయి శ్రీదేవిని వివాహాం చేసుకున్నాడు. వారిద్దరికీ పుట్టిన పిల్లలే జాన్వీ కపూర్ మరియు ఖుషీ కపూర్. శ్రీదేవి చనిపోయాక ఇరు ఫ్యామిలీలు దగ్గరవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు బాగా ఒకరికొకరు కలిసిపోయారు. అయితే జాన్వీ కపూర్ తో తనకున్న అటాచ్ మెంట్ గురించి కొన్ని కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవల ఒక బాలీవుడ్ ఫిలిం క్లబ్ లో జరిగిన మీటింగ్ లో ఈ విషయాన్ని పంచుకున్నాడు. జాన్వీ నన్ను అన్నయ్య అని పిలుస్తుంటే ఏదో కొత్త ఫీలింగ్ కలుగుతోందని చెప్పాడు. ఎప్పుడు అర్జున్ భయ్యా అని పిలిచినా గుండెల్లో నుండి ఆ పిలుపు వచ్చినట్లుగా ఫీలవుతానని చెప్పడం వారిద్దరి మధ్యన ఉన్న అన్నా చెల్లెళ్ళ బాండింగ్ తెలుపుతోంది.
ఇలానే పిలవాలి అని నేనెప్పుడూ తనకు చెప్పలేదు, అయినా జాన్వీ అలా పిలవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని గుర్తు చేసుకున్నాడు. అన్షు కూడా ఎప్పుడో ఒకసారి భయ్యా అని పిలుస్తుంది. కానీ జాన్వీ పిలుపులో నిజమైన ప్రేమ అభిమానం కనిపిస్తాయి. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. చనిపోయిన జాన్వీ కపూర్ అమ్మ శ్రీదేవి రెండు కుటుంబాలు కలవడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది ఉంటుంది.