అమర వీర జవాన్ కుటుంబానికి మోహన్ బాబు సాయం !

Divya
సినీ ఇండస్ట్రీ లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు ఎంత గుర్తింపు ఉందో , మనందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పటికి కూడా ఆయన ఎన్నో సినిమాలలో నటిస్తున్నాడు. ఆయన కుమారులు కూడా ఎన్నో సినిమాలలో నటించి, వరుస ఫ్లాపులను కూడా చవిచూశారు. ఈయన కూతురు కూడా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కూడా సక్సెస్ కాలేకపోయింది. ఇక మోహన్ బాబు ఫ్యామిలీ వీర జవాన్ కుటుంబానికి ఎంతో సహాయం చేసింది వాటి గురించి తెలుసుకుందాం.
ఇండియన్ ఆర్మీ లో అవల్దార్ గా పని చేసిన C.H. ప్రవీణ్ కుమార్ యుద్ధంలో వీర మరణం పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన కుటుంబానికీ మంచు ఫ్యామిలీ వారు అండగా నిలిచారు. ఈ జవాన్ గత సంవత్సరం శ్రీనగర్ లో 18 వ రెజిమెంట్ లో డ్యూటీలో ఉండగా అక్కడ ఉగ్రవాదుల ఎదురుదాడి కాల్పుల్లో మరణించాడు ప్రవీణ్ కుమార్.

ఈ ఆఫీసర్ భార్య పేరు రజిత, వీరికి ఒక కుమారుడు, కుమార్తె కలదు. వీరిది చిత్తూరు జిల్లా, ఐరాల మండలం. అయితే వీరికి ప్రభుత్వం తప్ప ఇక ఎవరూ , ఏ విధంగా సహాయం చేయలేదు. ఇక వీరి కుటుంబ పరిస్థితులను ఎలా ఉన్నాయో తెలుసుకున్న 18 వ రెజిమెంట్ ఆఫీస్ అధికార" OLV నరేష్". ఈ కమాండర్ ఆఫీసర్ మోహన్ బాబు గారికి తనే స్వతహాగా లేఖ రాసి, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలిపారట.
అందుచేతనే మోహన్ బాబు వారి ఇంటి దగ్గరికి వెళ్లి తమ పరిస్థితులను తెలుసుకొని, తమ కుమార్తె కు ఫ్రీగా చదివిస్తానని తెలిపారు. ఈ విషయంపై ప్రవీణ్ కుమార్ భార్య మోహన్ బాబు ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆదుకోవాలి. ప్రవీణ్ కుమార్ భార్య కృతజ్ఞతలు తెలపడంతో మోహన్ బాబు.." నా వంతు సహాయం మాత్రమే చేయగలిగాను. నాకు మీరు కృతజ్ఞతలు చెప్పవలసిన అవసరం కూడా లేదు." అంటూ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: