సుధీర్,రష్మి.. ఆది,దీపిక.. ఢీ టీమ్ లీడర్లకు జబర్దస్త్ పెళ్లి?

praveen
ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ఎప్పుడు వినూత్నమైన కాన్సెప్ట్ లతో అటు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి షో నిర్వాహకులు ప్లాన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ టీవీ లో అయితే బాగా ఫేమస్ అయిన జంటలకు సంబంధించిన పెళ్లిళ్లు చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అయితే ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ  అనే కార్యక్రమం లో ఈ వారం ఎపిసోడ్ లో జబర్దస్త్ లో ఇటీవలి కాలంలో బాగా ఫేమస్ అయిన వర్ష ఇమాన్యుల్ చేయబోతున్నారు.



 దీనికి సంబంధించిన ఆసక్తిగర ప్రోమో విడుదల చేసి అందరిలో అంచనాలను పెంచేశారు.  ఇక మరోవైపు జబర్దస్త్ లో కూడా రెండు పెళ్లిళ్లు చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ లుగా కొనసాగుతున్నారు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్.  ఇక మల్లెమాల నిర్వహిస్తున్న ఢీ షో లో కూడా వీరిద్దరు టీం లీడర్ గా కొనసాగుతున్నారు.  ఇక ఢీ షో లో సుధీర్ కి జోడీగా రష్మీ,ఆదికి జోడీగా దీపిక పిల్లి సహ టీం లీడర్ గా కొనసాగుతున్నారు. అయితే ఢీ షో లో ఈ నలుగురు కూడా ఎప్పుడూ సరి కొత్తగా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కాగా ఢీ షో లో టీం లీడర్లు అయిన ఈ రెండు జోడిలకు  జబర్దస్త్ లో పెళ్లి చేసేందుకు నిర్వాహకులు ప్లాన్ చేశారు.



 ఇక ఇటీవల జబర్దస్త్ కు సంబంధించి విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. హైపర్ ఆది సుడిగాలి సుధీర్ పెళ్లి కొడుకు గెటప్ లో పంచ కట్టుకుని కారులోంచి దిగి వస్తూ ఉంటారు  ఇక పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న రష్మీ, దీపిక లను అటు పల్లకిలో ఎత్తుకు వస్తారు. ఆ తర్వాత వీరందరూ కలిసి ఒక స్కిట్ చేస్తారు. స్కిట్ ముగియగానే వీరి పెళ్ళి తంతు కూడా ఉంటుంది.  అయితే ఇక వీరి పెళ్ళికి తంతు తో కూడిన కాన్సెప్ట్ ను తెరమీదకు తెచ్చి అటు నిర్వాహకులు జబర్దస్త్ మరింత అంచనాలు పెంచేసారూ. మరి వచ్చే వారం ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: