అప్పట్లో రజినీ కంటే ఎక్కువ రెమ్యూనరేన్ పొందిన వ్యక్తి..
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వెయ్యి రూపాయలు తీసుకున్న రజనీకాంత్ సూపర్ స్టార్ అవ్వగా, ఆ నటుడు మాత్రం పదిహేను వందల రూపాయలు తీసుకొని కూడా సినీ ఇండస్ట్రీలో హీరోగా విఫలం అయ్యాడు. అతనెవరో కాదు జీ.వి. నారాయణ రావు. ఇక ఈయన తండ్రి సినిమాల్లోనే పుట్టి, అక్కడే పెరిగి , చివరికి 1947 సంవత్సరంలో విజయవాడలో "నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూషన్" అనే సంస్థను ఏర్పాటుచేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన దాదాపు 90% సినిమాలను నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక అంతే కాదు ఈయన తండ్రి ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.
ఇక ఆ తర్వాత 1964 వ సంవత్సరంలో జీవినారాయణ వారి కుటుంబం హైదరాబాద్ లో సారథి స్టూడియో ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నారాయణ రావు మెహబూబా కాలేజీలో చదువు పూర్తి చేశాడు. ఇక 1976 సంవత్సరంలో కె.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన అంతులేని కథ చిత్రంలో రజనీకాంత్, జీవి నారాయణరావులు హీరోలుగా,జయప్రద హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా విడుదలైన సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు నారాయణరావు ఉత్తమ నటుడిగా అవార్డు కూడా పొందాడు.
ఇక ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించిన నారాయణ రావు , దాదాపు 7 ఉత్తమ అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే పెళ్లి వేడుకలకు మిమిక్రీ కూడా చేసేవారు. అంతులేని కథ సినిమాకు జీవి నారాయణరావు రూ.1500 రెమ్యునరేషన్ తీసుకోగా, రజనీకాంత్ రూ.1000 తీసుకున్నాడు. కానీ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు. ఇక ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తున్నారు నారాయణరావు .