పుష్ప కోసం ఏకలవ్యుడు అయిపోయిన బన్ని !
తెలుస్తున్న సమాచారం మేరకు ‘పుష్ప’ మూవీ ఫస్ట్ పార్ట్ లో అల్లు అర్జున్ అక్రమంగా కలప రవాణా చేసే స్థాయి నుండి మాఫియా లీడర్ గా ఎదగడం వరకు ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఉంటుందని అంటున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ లో బన్నీకి అత్యంత సన్నిహితుడైన ఒక సహచరుడు బన్నీ ప్రాణాన్ని నిలబెట్టడానికి తన ప్రాణత్యాగం చేస్తాడట.
అయితే బన్నీ కోసం ప్రాణాలు కోల్పోయిన ఆ సహచరుడుకి ఒక గుడ్డి తల్లి ఉంటుందట. తన కొడుకు పోయిన విషయం ఆమెకు తెలియకుండా బన్నీ ఆమె వద్ద నటిస్తూ కొడుకుగా కొనసాగుతాడట. అయితే మరణించిన బన్నీ సహచరుడుకి కుడి చేతికి కేవలం నాలుగు వేళ్ళు మాత్రమే ఉంటాయి కాబట్టి తన సహచరుడి తల్లి తనను గుర్తుపట్టకుండా ఆమె కొడుకులా నటించేందుకు తన వేలుని నరుక్కుంటాడట. ఈ సన్నివేశాన్ని సుకుమార్ చాల సహజంగా ఎమోషన్ పండిస్తూ చిత్రీకరించాడని తెలుస్తోంది.
ఎమోషనల్ సీన్స్ చిత్రీకరించడంలో దిట్ట అయిన సుకుమార్ ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు బన్నీతో ఒకటికి రెండు సార్లు రిహార్సిల్స్ చేయించి ధియేటర్ లో సినిమాలు చూసే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఇక మూవీకి సంబంధించిన సెకండ్ హాఫ్ లో బన్నీ చాల స్టైలిస్ట్ గా కనిపిస్తాడని ఈ సెకండ్ హాఫ్ లో అల్లు అర్జున్ కు ఒక చెల్లెలి పాత్రను క్రియేట్ చేసి ఆ పాత్ర అందరికీ కనెక్ట్ కావడానికి సాయి పల్లవిని రంగంలోకి దింపడానికి సుకుమార్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నప్పటికీ సాయి పల్లవి నుండి సరైన స్పందన లేదు అని అంటున్నారు..