ప్రజెంటర్‌గా మారిన కొరటాల శివ.. అసలు రీజన్ అదేనా..?

N.ANJI
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు కొరటాల శివ. రచయితగా ఇండస్ట్రీకి పరిచయమై.. దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నారు. ‘భద్ర, సింహా, బృందావనం’ వంటి హిట్ సినిమాలకు రచయితగా కొనసాగారు. అలాగే దర్శకుడిగా మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను అందించారు. ఈ సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించాయి.

అయితే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో సత్యదేవ్ కూడా ఒకటి. నిన్న సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పలు సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అలాగే కొన్ని సినిమాల విడుదలకు సంబంధించిన తేదీలు ఖరారు చేశారు. అయతే ఇందులో ఒక అంశం ఆసక్తిగా మారింది. సత్యదేవ్ నటిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 2 సినిమాకు దర్శకుడు కొరటాల శివ ప్రజెంటర్‌గా మారిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.

సత్యదేవ్ తన 25వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ స్నేహితుడు కృష్ణ కొమ్మాలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. అయితే గతంలో కృష్ణ కొమ్మాలపాటి.. హీరో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి జవాన్ సినిమాను చిత్రీకరించారు. ఊహించిన స్థాయిలో ఆ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం కొత్త సినిమా దర్శకత్వానికి కొత్త డైరెక్టర్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

హీరో సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ చిత్రంతో పాటుగా ‘గాడ్సే, గుర్తుందా శీతాకాలం’లో కూడా నటిస్తున్నారు. అయితే గాడ్సే చిత్రం షూటింగ్ ఈ నెల తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ సినిమాను ‘బ్లఫ్ మాస్టర్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీసిన గోపి గణేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ అయ్యే సినిమాలతో సక్సెస్ దక్కించుకుంటారా అనే కొద్ది రోజులపాటు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: